పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ(Asif Ali Zardari) భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంట్ వేదికగా ప్రసంగిస్తూ, ఢిల్లీ సర్కార్ యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Taliban Attack: పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

అఫ్గాన్ అంశంపై జర్దారీ విశ్లేషణ
ఇదే క్రమంలో పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్‌పై కూడా జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా ఆయన అభివర్ణించారు. శాంతి స్థాపన కోసం అఫ్గాన్ కూడా చర్చలకు రావాలని కోరారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని జర్దారీ పేర్కొనడం గమనార్హం.
గత దాడుల భయం వెంటాడుతోందా?
గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) పాకిస్థాన్‌ను ఎంతలా వణికించాయో అందరికీ తెలిసిందే. భారత సైన్యం సృష్టించిన ఆ భయం నుంచే ఇప్పుడు జర్దారీ ఇలాంటి శాంతి మంత్రం పఠిస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: