हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు

Anusha
Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు బట్టబయలు చేస్తున్నారు.హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆపరేషన్ సిందూర్‌‌, పాకిస్థాన్ ఉగ్రవాదం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని దాయాది ఎలా పెంచి పోషిస్తుంది? భారత్‌‌కు దాని వల్ల ఎదురవుతోన్న సవాళ్ల గురించి‌‌ తెలియజేన్నాయి. బీజేపీ ఎంపీ వైజయంత్ పాండ(Vyjayant Panda) నేతృత్వంలోని ఎంపీల బృందం ప్రస్తుతం అల్జీరియాలో పర్యటిస్తోంది. ఇందులో సభ్యుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ దక్షిణాసియాలో అస్థిరతకు పాక్ కారణమవుతోందని దుయ్యబట్టారు.అల్జీరియాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఒవైసీ పాక్ చేస్తున్న తప్పుడు పనులను ఎండగట్టారు. పాకిస్థాన్ జైలులో ఉండగానే ఒక ఉగ్రవాది బిడ్డకు జన్మినిచ్చాడని ఆయన అన్నారు. జైలులో ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ(Zakir Rehman Lakhvi)ని పాకిస్థాన్ ప్రత్యేకంగా చూసుకుంటోందని ఆయన విమర్శించారు. ‘జకీర్ రెహ్మాన్ లఖ్వీ అనే ఒక ఉగ్రవాది ఉన్నాడు. ప్రపంచంలో ఏ దేశమూ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని (జైలు నుంచి బయటకు రావడానికి) అనుమతించదు. కానీ అతడు జైలులో ఉండగానే ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు’ అని ఆరోపించారు. అంటే, జైలులో ఉన్న ఉగ్రవాదికి అన్ని సౌకర్యాలు అందుతున్నాయనిచెప్పారు.

సహాయం

పాకిస్థాన్‌ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచితేనే ప్రపంచానికి శాంతి చేకూరుతుందని ఒవైసీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసే దేశాలపై నిఘా ఉంచే ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ లో ఉంచితే ఆ దేశానికి అంతర్జాతీయంగా ఆర్థిక సహాయం అందదు. దీని ద్వారా ఉగ్రవాదానికి(Terrorism) సహాయం చేసే దేశాలకు చెక్ పెట్టవచ్చు.భారత్‌కు సహాయం చేయాలని ఈ సందర్భంగా అల్జీరియాను ఒవైసీ కోరారు. 2018లో పాకిస్థాన్‌ను తిరిగి గ్రే లిస్ట్‌లోకి తీసుకువచ్చిన తర్వాత భారతదేశంలో ఉగ్రవాదం తగ్గిందని ఆయన అన్నారు. ఉగ్రవాదం ఎలా పుడుతుందో ఒవైసీ వివరించారు. ‘ఉగ్రవాదం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి భావజాలం, రెండు డబ్బు. ఈ విషయంలో పాకిస్థాన్ తనకు మతపరమైన అనుమతి ఉందని భావిస్తోంది. కాని ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ఏ వ్యక్తినీ చంపడానికి అనుమతించదు. దురదృష్టవశాత్తు అదే వారి సిద్ధాంతం’ అని అన్నారు. ఉగ్రవాదులకు ఒక తప్పుడు భావజాలం ఉంటుందని, దాని ద్వారానే వారు దాడులు చేస్తారని హైదరాబాద్ ఎంపీ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే.

Read Also: China: తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870