हिन्दी | Epaper

ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్‌స్కీకి పెరిగిన మద్ధతు

sumalatha chinthakayala
ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్‌స్కీకి పెరిగిన మద్ధతు

కీవ్‌: ఇటీవల వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ , ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీకి ప్రజల మద్దతు లేదని.. ఆయన ఓ నియంత అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీకి ఉన్న మద్దతుపై అభిప్రాయ సేకరణలు చేపట్టాయి. తాజాగా విడుదలైన నివేదికల్లో ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఆయనకు ప్రజామోదం 10 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌తో వాగ్వాదం జెలెన్‌స్కీకి పెరిగిన

అదే జెలెన్‌స్కీకి మద్దతు పెరగడానికి ముఖ్య కారణం

కీవ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్‌లో 67శాతం ఉక్రెయిన్‌ ప్రజలు తాము జెలెన్‌స్కీని విశ్వసిస్తున్నామని తెలిపారు. తొలుత 57శాతంగా ఉన్న ఆయన మద్దతుదారులు అమెరికాలో ట్రంప్‌తో భేటీ అనంతరం 10 శాతం పెరిగారని పేర్కొన్నారు. ట్రంప్ దురుసు ప్రవర్తనతో తమ అధినేతను అవమానించినట్లు ప్రజలు భావించారని.. అదే జెలెన్‌స్కీకి మద్దతు పెరగడానికి ముఖ్య కారణమని భావిస్తున్నారు.

కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ

డొనాల్డ్‌ ట్రంప్‌ , జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ జెలెన్‌స్కీని ఓ నియంతగా అభివర్ణించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్‌ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారంటూ నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాల్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలు కావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. జెలెన్‌స్కీకి తమ దేశంలో ప్రజామద్దతు 4 శాతమే ఉందని వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్‌ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కొట్టిపారేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870