हिन्दी | Epaper

America : అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత..ఇద్దరి మృతి

sumalatha chinthakayala
America : అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత..ఇద్దరి మృతి

America : అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహస్సీలో ఉన్న‌ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు సంభ‌వించాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ కాల్పుల‌కు పాల్ప‌డింది లియోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ జెస్సికా ఇక్నర్ కుమారుడు.. 20 ఏండ్ల ఫీనిక్స్ ఇక్నర్ అని స‌మాచారం. ఇక్న‌ర్ తన తల్లికి చెందిన‌ మాజీ సర్వీస్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. ఇక్న‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత

యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ

స్టూడెంట్ యూనియన్ సమీపంలో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు సమాచారం అందడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది క్యాంపస్‌ను వీడి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. దాదాపు ఉద‌యం 11:50 గంట‌ల‌కు స్థానిక సమయంలో కాల్పులు ప్రారంభమయ్యాయి, పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని నిలువరించారు. ఈ ఘటనతో క్యాంపస్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. గురువారం జరగాల్సిన తరగతులు, క్రీడా కార్యక్రమాలు, ఇతర ఈవెంట్‌లు రద్దయ్యాయి. ఈ ఘటన గురించి అధికారులు అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారం చేర్చారు. ఆయన ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, దీనిని భయంకరమైన సంఘటనగా పేర్కొన్నారు.

Read Also: రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870