కెనడా(Canada) లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ (liberal Party) మరోసారి ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. పార్టీ అధినేత మార్క్ కార్నీ(Marks Carne) మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ పునర్నిర్మాణంలో భాగంగా అనితా ఆనంద్(Anita Anand) ను విదేశాంగ మంత్రి(Foreign Minister)గా నియమించారు. అయితే ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ అరుదైన ఘనత రెండోసారి కూడా సాధించడం పట్ల ఆమెను అభినందిస్తున్నారు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ (JaiSanker) సహా పలువురు భారతీయ ప్రముఖులు సోషల్ మీడియా (Social Media)వేదికగా విషెస్ తెలియజేశారు. దీంతో అనితా ఆనంద్ గురించి మన వాళ్లంతా తెగ వెతికేస్తున్నారు.

నోవాస్కోటియా లోని కెంట్‌విల్లేలో జన్మించిన అనిత
1967 మే 20న నోవాస్కోటియా లోని కెంట్‌విల్లేలో జన్మించారు అనితా ఆనంద్. ఆమె తమిళ, పంజాబీ మూలాల కలిగిన కుటుంబానికి చెందినవారు. తల్లి సరోజ్ దౌలత్‌రామ్ అనస్తీషియాలజిస్ట్ కాగా, తండ్రి సుందరం వివేక్ జనరల్ సర్జన్. ముగ్గురు సోదరీమణుల్లో పెద్దదైన అనితకు గీత, సోనియా అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. విద్యాభ్యాసం.. 1985లో ఒంటారియోకి వెళ్లిన అనిత.. రాజకీయ శాస్త్రంలో డిగ్రీ సాధించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో ఆన్‌ర్స్ డిగ్రీ, ఆ తర్వాత డల్హౌసీ, టొరంటో యూనివర్సిటీల నుంచి న్యాయశాస్త్రంలో బాచిలర్స్, మాస్టర్స్ పూర్తిచేశారు. లాయర్‌గా ఎన్నో సంవత్సరాలు పనిచేశారు.
వివాహం.. 1995లో జాన్ నోల్టన్ అనే న్యాయవాదిని అనితా ఆనంద్ వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతో కలిసి ఓక్‌విల్లేలో నివసిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీ
అనితా ఆనంద్ రాజకీయంగా ఇప్పటికే విశేష అనుభవం పొందారు. 2019లో కెనడా ఫెడరల్ క్యాబినెట్‌లో పనిచేసిన మొదటి హిందూ మహిళగా సైతం గుర్తింపు పొందారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆమె కెనడా రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని ఆరికట్టి కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకుగానూ పలు పురస్కారాలు అందుకున్నారు.
పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు
ఇక ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆ స్థానంలో మెలానీ జోలీ బాధ్యతలు స్వీకరించారు. అలానే అనితా అనంద్ గతంలో రక్షణ మంత్రిగానే కాకుండా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. భగవద్గీతపై ప్రమాణం.. మరోవైపు ప్రమాణ స్వీకారం సందర్భంగా అనితా ఆనంద్ భగవద్గీతపై చేయి ఉంచి ప్రమాణం చేశారు. గతంలో సైతం ఆమె ఇలానే వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా ఎక్స్ వేదికగా.. కెనడా విదేశాంగ మంత్రిగా నియమించబడటం గౌరవంగా భావిస్తున్నానని రాసుకొచ్చారు. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలో కెనడియన్లకు సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని రాసుకొచ్చారు.
Read Also: Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు