ఇటీవల కాలంలో అమెరికాలోనూ హెలికాప్టర్లు, విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రెండు హెలీకాప్టర్లు గగనతలంలోనే ఢీకొట్టాయి. ఒక హెలికాప్టర్ పైలెట్ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. ఎన్ స్ట్రోమ్ ఎఫ్-28ఎ హెలికాప్టర్, ఎన్ స్త్రోమ్ హెలికాప్టర్ లు ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు హెలికాప్టర్లలో ఒక్కొక్క పైలట్లు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ సంఘటన అట్లాంటిక్ కౌంటీలోని హామోంటన్ విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 11.25 గంటలకు జరిగినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
Read also: Train Accident: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం-13 మంది దుర్మరణం
గిరగిరా తిరుగుతూ కూలిపోయిన హెలికాప్టర్ ఇక ప్రమాద విషయం తెలియగానే అత్యవసర బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఇక హెలికాప్టర్ నేలపై కూలిపోయే ముందు గిరగిర తిరుగుతూ కూలిపోయినట్లుగా వీడియోలో కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వేగంగా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఒక పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా..ఇంకొక పైలట్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలు మాత్రం
వెల్లడించలేదు.
ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమా?
ప్రమాదం జరిగిన సమయంలో ఆకాశం మేఘావృతం అయి ఉంది. ఆ సమయంలో తక్కువ స్థాయిలోనే గాలులు వీస్తున్నాయి. ప్రమాదానికి వాతావరణం అనుకూలించకపోవడమా? మరేదేమైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వాతావరణ డేటాతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్స్, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ రిక్టారులను సమీక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: