అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచ రాజకీయ వేదికపై తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. విదేశాంగ విధానం, వాణిజ్యం, వలస విధానాల విషయంలో ట్రంప్ అవలంభిస్తున్న కఠిన వైఖరి ఆయనను అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక వివాదాస్పద నాయకుడిగా మార్చింది. అధిక సుంకాలు విధించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచడమే కాకుండా, అమెరికాలో ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ నిపుణులపై ప్రభావం చూపేలా లక్షడాలర్ల హెచ్-1బి వీసా ఫీజు ప్రతిపాదన తీసుకురావడం వంటి నిర్ణయాలు భారతదేశాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య ట్రంప్ పరిపాలన వెనిజులాపై చేపట్టిన సైనిక చర్యలు మరింత సంచలనంగా మారాయి. వైమానిక దాడులు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా పశ్చి అర్ధగోళంలో అమెరికా చేపట్టిన అత్యంత కీలక సైనిక చర్యలలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల ట్రంప్ అంతర్జాతీయ స్థాయిలో తాత్కాలికంగా బలమైన నేతగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలికంగా అమెరికా కు కలిగే ప్రయోజనాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read also: US Defense: దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

Modi has greater public support than Trump
ట్రంప్ ప్రభావం ఎక్కువ కాలం ఉండదు..
ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో (Narendra modi) ట్రంప్ ను పోలుస్తూ జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెమ్మర్ ట్రంప్ తీసుకున్న వెనిజులా నిర్ణయాలు స్వల్పకాలిక లాభాలను ఇవ్వవచ్చని అంగీకరించినప్పటికీ, ట్రంప్ పదవీ విరమణ అనంతరం అవి కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు నాయకత్వం మారే నరపజాస్వామ్య వ్యవస్థ కారణంగా విధానాల్లో స్థిరత్వం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలు వెనిజులా చమురు మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాయన్న అంచనాలను బ్రెమ్మర్ అతిశయోక్తిగా కొట్టిపారేశారు.
ప్రజాదరణ గల నాయకుడు మోడీ: బ్రెమ్మర్
భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్దానికి పైగా బలమైన ప్రజాదారణతో పాలన కొనసాగించడం ఒక ప్రధాన తేడా అని చెప్పారు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాల్లో నాయకత్వానికి స్థిరత్వం ఉండగా, అమెరికాలో అది కొరవడిందని ఆయన అన్నారు. తదుపరి అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలను సులభంగా రద్దు చేయగలడు. ఇది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కాదు, పది సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న మోడీ కూడా కాదు. ఇది ట్రంప్ పాలన.. ప్రజాదరణ తక్కువగా ఉన్న నాయకుడు, మూడు సంవత్స రాల్లో పదవి విడిచిపెట్టాల్సి వస్తుందని బ్రెమ్మర్ వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: