ఆమెరికా లెకపోతే నాటో దేశాలకు విలువే లేదంటూ మిగిలిన దేశాలకు చులకన భావనతో చూడటం, రాత్రికి రాత్రే ఒక దేశాధ్యక్షున్ని బంధించి ఆదేశానికి సంక్షోభానికి గురిచేసి వారి చమురు సంపదను హస్తగతం చేసుకోవడం, ప్రపంచం భవిష్యత్తు కోసం వాతావరణ మార్పులపై ఎన్నో ఒప్పందాలు చేసుకున్న వాటిని సైతం అసలు విలువే లేదని తుంగలో తొక్కడం, భారత్, పాక్ యుద్ధాన్ని నా హెచ్చరి కలతో ఆపాననే అబద్దపు పబ్లిసిటీ చేయడం, మెక్సికో, క్యూబా లాంటి చుట్టు పక్కల దేశాలకు మాత్రమే కాకుండా అనేక దేశాలకు భయబ్రాంతులకు గురిచేసే విధానం, తన మాటలను వినకపోతే ఆర్థిక పరమైన యుద్ధ ఉన్మాదంతో 500శాతం వరకు సుంకాలను విధించే గుణం గలగడం, తనకు ఇష్టం లేని దేశంతో మరోదేశం వాణిజ్యం చేసుకోవడానికి సైతం అడ్డుపడే తత్వం కలిగి ఏకంగా వారి చమురు టాంకర్స్ ను బంధించడం, అనేక కారణాలను సాకుగా చూపెట్టి విలునైన ఖనిజాల కోసం డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉన్న గ్రీన్లాండ్ను ఆక్రమించడం కోసం ఉవ్విళ్లూరడం, అంత ర్గత సమస్యలను సాకుగా చూపించి ఇరాన్ లాంటి దేశాలపై దాడికి
ప్రయత్నించడం లాంటి ఎన్నో భయానక వాతావర ణం సృష్టిస్తున్న తీరు ప్రపంచ ప్రజానీకానికి కనబడుతున్న ప్పటికీ తను అత్యంత శాంతి మంతుని అని ప్రకటించు కుంటూ ఏకంగా తనకు తాను నేను శాంతి నోబెల్ ప్రైజ్ కి పూర్తి అర్హుడని ప్రకటించుకోవడం అనేది బహుశా అమెరికా (America) అధ్యక్షుడైన ట్రంప్డ్కే సాధ్యమవుతుందేమో అనే అభిప్రాయం కలుగుతుంది నేటి ప్రపంచ ప్రజానీకానికి. ప్రస్తుత సమ యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఇష్యూస్ న్యూస్ గమనిస్తే ట్రంప్ లేని వార్తలే లేనేలేదేమో అనిపిస్తున్న సందర్భం ఇదని చెప్పవచ్చు.
Read Also : Trump: బంగారం దెబ్బకు డాలర్ విలవిల

ట్రంప్ హెచ్చరికలు
ప్రస్తుత తరుణంలో ట్రంప్ హెచ్చరికలు అనేక రూపాలలో వెలువడుతూనే ఉన్నాయి. అందులో ఒకటి స్వతహాగా వ్యాపారవేత్త అయినా ట్రంప్ వ్యాపారపరమైన ఆలోచనలతో అనగా ఆర్థికపరమైన యుద్ధాలను ప్రకటించి యుద్ధ భయం కల్పిస్తున్నారు. రష్యాతో ఎన్నోఏళ్ల నాటి పరోక్ష శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న అమెరికా(America) ఉక్రెయిన్ రష్యా యుద్ధాలను సాకుగా చూపి రష్యాతో వాణిజ్య సంబంధాల ను కొనసాగిస్తున్న దేశాలపై ఆర్థిక యుద్ధం ప్రకటించడం లాంటి విధానం చూస్తే ట్రంప్ ది ఎలాంటి మనస్తత్వమో తేటతెల్లమవుతుంది. రష్యాపై ఆంక్షల చట్టం 2025 అనే బిల్లుతో భారత్ అమెరికా సంబంధాలను బీటలు పడేలా చేస్తున్నది అమెరికా. ఈబిల్లు వలన ద్వితీయ పక్ష కొను గోళ్లు, పునఃవిక్రయంపై 500 శాతం సుంకాలను భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలపై అమలు చేయుటకు సమా యత్తమవడంతో అది ట్రంప్ ఆర్థికపరయుద్ధ మనస్తత్వానికి అద్దం పడుతుందని అభిప్రాయం కలుగుతుంది నేటి ప్రజానీ కానికి. వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన భారత్కు రోజువారి అవసరత మేరకు చమరు వినియోగం పెరగడం సహజం. దీని దృష్ట్యా అంతమంది జనాభాకు అవ సరాన్ని తీర్చడానికి చౌకగా దొరుకుతున్న రష్యా చమురును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి భారత్కు ఉన్నదనే విష యం అమెరికాకు సైతం తెలిసిన విషయమే. పైగా ఎప్పటి నుండో రష్యా భారత్ స్నేహం తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్ అడ్డంకులను సృష్టిస్తున్నారు.
భారత్ పై ప్రభావం
ట్రంప్ సృష్టిస్తున్న ద్వారా అడ్డం కులను నిశితంగా పరిశీలిస్తుంది భారతావని. ఇదే విధానం పలు దేశాలపై రుది వాటిని నిస్సహాయత వైపు నెట్టడం చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఇరాన్పై దాడి చేస్తానని హెచ్చరికలు చేస్తూ ఇరాన్ను బలవంతంగా తన చెప్పుచేతుల్లో ఉంచడానికి అవకాశం ఉన్న అన్ని విధానాలను ముందుకు తెస్తున్నట్లు అభిప్రాయపడాల్సి వస్తుంది. అప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలు అనేక ఆర్థిక ఆంక్షల వలన ఆర్థిక సంక్షోభంలో పడ్డ ఇరాన్పై తన ప్రజలే తిరగబ డుతున్న సమయాన్ని అవకాశంగా తీసుకున్న”ట్రంప్కంగా ఇరాన్లో ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాల ను చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి, ఆందోళన కొనసాగించండి, మీకోసం సాయం వస్తుందనే విధంగా ట్రంప్ వ్యాఖ్యానాలు ఎంతో అశాంతియుతంగా ఉన్నట్లు అభిప్రాయపడాల్సి వస్తుందన్నట్లుగా ఉంది. అయితే ఇరాన్ నిరసనకారులను అణిచివేతను ట్రంప్ సాకుగాచూపిం చి మరింత దూకుడుగా ఇరాన్పై యుద్ధమేఘాలను కమ్ముకు నేటట్లు చేసి, చర్చలకు కూర్చోబెట్టి, మరింత ఆర్థిక సంక్షోభం లో నెట్టేందుకు సమాయాత్తం అవుతున్నారని విశ్లేషకుల వాదన. ఇందులో భాగంగానే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే ఆయాదేశాలపై 25శాతం టారిఫ్ లను విధిస్తామ ని తన ట్రూత్ సోషల్చె ప్పడం జరిగింది. పైగా ఈ విధానం తక్షణమే అమలులో వస్తుందని ఘంటాపదంగా తెలియపరచడం చేశారు. ఇది భారత్ పై కూడా కొంతమేర ప్రభావం చూపనుంది. ఇరాన్తో వాణిజ్య భాగస్వాములుగా ఇండియా, చైనా, యూఏఈ, ఇరాక్ లాంటి దేశాలే అయిన ప్పటికీ వాటిలో చైనాయే ప్రధానమైనదని భావించాలి. ఇరాన్ నుండి చైనాకు చవకగా చమురు సరఫరా అవుతున్నందువల న తాజాగా ట్రంప్ అదనపు టారిఫ్ల ప్రభావం చైనాపై ఎక్కువగా ఉంటుందనేది ప్రధాన అభిప్రాయం. దీనికి ప్రతి స్పందనగా చైనా సైతం ప్రతీకారచర్యలు తప్పవని హెచ్చరిక లు చేస్తుంది.

వ్యూహాత్మకం
వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ బంధించి చైనా వాణిజ్యం తగ్గించడం, ఇరాన్ పై ఆంక్షలు వేసి చైనా, భారత్ మరికొన్ని దేశాల వాణిజ్యం దెబ్బతీయడం, రష్యా ఆంక్షలు చట్టం 2025 తో ప్రధానంగా భారత్ పై 500శాతం టారిఫ్ ను విధించి కట్టడి చేసే ప్రయత్నం చేయడంచూస్తే అన్ని వ్యూహాత్మకం గానే ట్రంప్ అశాంతి వైపు ప్రపంచ దేశాలను నెట్టి వేస్తున్నట్లుగా ఉంది. ఒకే సందర్భంలో ట్రంప్ రెండు కోణాలను మనం గమనించవచ్చు. అందులో మొదటిది తనమాట వినని దేశాల అభివృద్ధికి ఎంతమేరకు అవరోధాలు కలిగించవచ్చునో అంతగా వారి ఆర్థిక అభివృద్ధికి అడ్డు తగలడం, వారిపై ఆర్థికపరమైన యుద్ధమే ప్రకటించినట్లుగా చేయడం. అలానే రెండో విధానం చూస్తే అదే సమయంలో ట్రంప్ అమెరికా వాణిజ్య ఆర్థికతను బలోపేతం చేసుకునేం దుకు అనుసరిస్తున్న విధానాలను అవలంబిస్తున్నట్లు తెలు స్తుంది. ఈ విధానంలో భాగమే వెనిజువెలా, గ్రీన్ల్యాండ్, ఇరాన్ లాంటివాటిపై భయాలు సృష్టించడం ట్రంప్ చేస్తున్న ట్లుంది. అనగా వెనుజులాకు ఆర్థికంగా బలోపేతానికి కారణ మైన అక్కడి చమురు సంపదపై ట్రంప్కు మక్కువ ఎక్కువైన దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ట్రంప్ వీలైనంతవరకు చాలాదేశాలను వాణిజ్య ఆర్థికంగా కుంగుబాటు కు గురిచేస్తూ తనకు శత్రువుగా ఉన్నదేశాలకు తను వాణిజ్య పరంగా సపోర్టు చేసే దేశాలు సైతం శత్రువుగా చూడాలని ఆజ్ఞాపిస్తూ, ఖనిజ సంపదలతో ఉన్న గ్రీన్లాండు కలుపుకునేందుకు ట్రంప్ చేసే ప్రయత్నాలు లాంటి ప్రస్తుత పరిస్థితులనుచూస్తే అమెరికాకున్న గుణాలకు నిదర్శనమని ప్రపంచ దేశాలు భావించాల్సి ఉన్నది. ప్రపంచ దేశాలలో ఇన్ని రకాల అశాంతికి కారణభూతమైన ట్రంప్ తను శాంతి దూతనని ప్రకటించుకోవడమే కాక తన ఆధ్వర్యంలో ఉన్న దేశంలోని విపక్ష నేత మారియా కోరీనా మచాడో కు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని తన నుండి గిఫ్ట్ గా తీసుకోవ డం అనేదిచూస్తే నోబెల్ శాంతి బహుమతి నోబెల్.. అశాంతి కలిగించే వారికి బహుమతిగా మారిపోయిందా! అనే అభిపాయం ప్రపంచ ప్రజానీకానికి రాక మానదేమో!
-వి. వి. రమణ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :