ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారింది. అది కాస్త చంపేంత ఆగ్రహానికిదారితీసింది. ఎంతలా అంటే అతను తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వెంటాడి.. వేటాడి మరి హతమార్చాడు. అంతటితో అతడి ఆగ్రహం (Anger) ఆగిపోలేదు.తల..మొండెం వేరుచేసి చెత్తకుప్పలో వేసేంతగా రగిలిపోయాడు. ఏంటీ ఈ స్టోరీ అనుకుంటున్నారా.. మీరే చదవండి ఆ వివరాలు ఏమిటో..
భారతీయుడిని హతమార్చిన అమెరికన్

అమెరికాలోని డాలస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్ గా చంద్రమౌళి నాగమల్లయ్య (Chandramouli Naga Mallaiah as Manager),(50) అనే వ్యక్తి జీవిస్తున్నారు.నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మోటల్లో గదిని మార్టినెజ్ శుభ్రం చేస్తున్న విషయంలోనాగమల్లయ్యకు మార్టినెజ్ ల,మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. దీంతో మార్టినెజ్ (Martinez) ఆగ్రహానికి గురయ్యాడు. ఇంకేమీ ఉంది,ఆవేశంతో ఊగిపోతూ కత్తితో మల్లయ్యను పొడిచి చంపాడు.
పరిసరప్రాంతాలు పలు కార్లు, పలువురు ఉన్నా
అంతటితో ఆగక శరీరం నుంచి తలను వేరుచేసి, చెత్తబుట్టలో పడేసి తాపిగా వెళ్లాడు. ఆ పరిసరప్రాంతాలు పలు కార్లు, పలువురు ఉన్నా ఏఒక్కరూ నాగమల్లయ్యను రక్షించే సాహసంచేయలేదు. పాపం మల్లయ్య కుటుంబ సభ్యులు (Mallaiah family members) హంతకుడి నుంచి కాపాడుకునే విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేదు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ (X) గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: