ప్రతి నెలా లక్షల మంది ప్రజలు సరికొత్త స్టైల్స్ తెలుసుకునేందుకు పింటరెస్ట్ యాప్‌ను ఓపెన్ చేస్తుంటారు. దానిపై ‘వియర్డెస్ట్ థింగ్స్’ అనే ఒక పేజీ ఉంది. దానిలో సృజనాత్మకతను ఇష్టపడే ప్రజల కోసం వినూత్నమైన ఐడియాలు ఉంటాయి. క్రాక్స్‌తో చేసిన పూలకుండీలు, చీజ్‌బర్గర్ లాంటి ఐషాడోలు లేదా కూరగాయల నుంచి చేసిన జింజర్‌బ్రెడ్ హౌస్ ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. కానీ, దీనికి వెనుకాలనున్న టెక్నాలజీ అమెరికాలో రూపొందిందో లేదో చాలామందికి తెలియదు. పింటరెస్ట్ తన రికమండేషన్ ఇంజిన్‌ను మరింత మెరుగుపర్చేందుకు చైనాకు చెందిన ఏఐ విధానాలతో ప్రయోగాలు చేస్తోంది. ”పింటరెస్ట్‌ను ప్రాథమికంగా ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్‌గా మార్చేశాం” అని ఆ కంపెనీ సీఈఓ బిల్ రెడీ చెప్పారు. నిజమే, శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ తన టెక్నాలజీ పని కోసం అమెరికాకు చెందిన ఏదైనా ఏఐ ల్యాబులను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, చైనా(China) డీప్‌సీక్ ఆర్1 మోడల్ 2025 జనవరిలో విడుదలైనప్పటి నుంచి, పింటరెస్ట్‌లో చైనాకు చెందిన ఏఐ టెక్నాలజీ పాత్ర గణనీయంగా పెరుగుతోంది.
Read Also: US: అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

‘డీప్‌సీక్ విప్లవం’ గణనీయమైన విజయం
ఈ ‘డీప్‌సీక్ విప్లవం’ అనేది గణనీయమైన విజయం సాధించిందని పింటరెస్ట్ కంపెనీ సీఈఓ బిల్ రెడీ తెలిపారు.”వారు ఓపెన్ సోర్స్ విధానాన్ని (అందరికీ అందుబాటులోకి ఉంచడం) అందిస్తున్నారు. ఓపెన్ సోర్స్ మోడళ్లలో ఇది ఒక పెద్ద విప్లవాన్నే ప్రారంభించింది” అని తెలిపారు. అలీబాబాకు చెందిన ‘క్వెన్’ , మూన్‌షాట్‌కు చెందిన ‘కిమి’, టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ ‘బైట్‌డాన్స్’ వంటి చైనాకు చెందిన ఇతర ప్రత్యర్థి కంపెనీలు ప్రస్తుతం ఇదే టెక్నాలజీని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ”చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ వంటి అమెరికాకు చెందిన చాలా కంపెనీల మోడళ్లతో పోలిస్తే.. ఈ మోడళ్ల అతిపెద్ద బలం ఏంటంటే.. కంపెనీలు వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, వారి అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చు” అని పింటరెస్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మ్యాట్ మాడ్రిగల్ తెలిపారు. ‘
చైనా ఏఐ టెక్నాలజీపై ఆధారపడ్డ ఏకైక అమెరికా కంపెనీ పింటరెస్ట్
అమెరికా ఏఐ డెవలపర్లు రూపొందించిన ప్రొప్రైటరీ మోడళ్లతో (కేవలం యజమాన్య సంస్థ మాత్రమే నియంత్రించే మోడళ్లతో) పోలిస్తే ఇవి 90 శాతం వరకు తక్కువకు లభిస్తున్నాయన్నారు. చైనా ఏఐ టెక్నాలజీపై ఆధారపడ్డ ఏకైక అమెరికా కంపెనీ పింటరెస్ట్ మాత్రమే కాదు. చాలా ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఈ మోడళ్లు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సీఈఓ బ్రియాన్ చెస్కీ గతేడాది అక్టోబర్‌లో బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడినప్పుడు.. తమ ఏఐ కస్టమర్ సర్వీసు ఏజెంట్ల పనితీరును పెంచడం కోసం తన కంపెనీ ఎక్కువగా అలీబాబా క్వెన్ మోడల్‌పై ఆధారపడుతుందని తెలిపారు. దీనికి గల మూడు కారణాలను ఆయన వివరించారు. ఇది చాలా మంచిది, చాలా వేగంగా పనిచేస్తుంది. చౌకగా లభిస్తుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: