భారత్ పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) పాకిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశమయ్యాయి.జైషే మహమ్మద్,లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దీర్ఘకాలంగా అఫ్గనిస్థాన్ భూభాగాన్ని తమ కార్యకలాపాలకు అడ్డగా చేసుకున్నాయి.
Nobel Committee: ప్రచారాలు కాదు, చిత్తశుద్ధే ముఖ్యమన్న నోబెల్ కమిటీ
కానీ, గత నాలుగేళ్లలో అన్ని ఉగ్రవాద సంస్థలను తమ భూభాగం నుంచి తరిమికొట్టామని భారత పర్యటనలో ఉన్న తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ (Amir Khan Muttaqi) వెల్లడించారు. శాంతి విషయంలో పాకిస్తాన్ కూడా తమ మార్గాన్నే అనుసరించాలని ముత్తఖీ సూచించారు. ‘వాళ్లలో ఒక్కడు కూడా అఫ్గనిస్థాన్‌లో లేడు.
వారి నియంత్రణలో ఒక్క అంగుళం భూమి కూడా లేదు. మేము (2021లో) ఆపరేషన్ నిర్వహించిన అఫ్గన్ ఇప్పుడు మారిపోయింది’ అని ముత్తఖీ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు కూడా బలమైన సందేశం పంపిన తాలిబన్ మంత్రి.. శాంతి కోసం అఫ్గనిస్థాన్ (Afghanistan) మాదిరిగా ఉగ్రవాద సమూహాలపై ఇతర దేశాలు కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

భారత్‌తో సంబంధాలపై ముత్తాఖీ ప్రశంసలు
అఫ్గన్‌లో రెండోసారి తాలిబన్లు (Taliban) అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబన్ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. దీంతో నాలుగేళ్ల తర్వాత భారత్, అఫ్గన్ మధ్య మళ్లీ దౌత్య కార్యకలాపాలు పునరుద్దరణకు ముందడుగు పడింది. కాబూల్‌లోని టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
మరోవైపు, భారత్‌తో సంబంధాలపై ముత్తాఖీ (Amir Khan Muttaqi) ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘనిస్థాన్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాబూల్ (Kabul) లోని భారత టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని జైశంకర్ హామీ ఇచ్చారని తెలిపారు.
భూకంపం సంభవించినప్పుడు మొదటగా స్పందించి ఆదుకున్నది భారతేనని గుర్తుచేసుకున్నారు. పరస్పర గౌరవం, వాణిజ్యం ఆధారంగా భారత్‌తో బలమైన స్నేహాన్ని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: