అదానీ గ్రూప్(Adani Grou) మరో కొత్త చరిత్ర సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమ ఫలితాలను రికార్డ్ చేసింది. రికార్డు లాభాలు, అత్యధిక EBITDA ఆదాయాలు, ఆస్తులపై అద్భుతమైన రాబడి (ROA) వంటివి ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా చేసాయి. ఈ సంవత్సరం అదానీ పోర్ట్‌ఫోలియో(Adani adani portfolio) EBITDA రూ.89,806 కోట్లకు చేరుకుంది, అంటే ఇప్పటివరకు అత్యధికం. అలాగే రూ.1.26 లక్షల కోట్ల కాపిటల్ పెట్టుబడి అండ్ 16.5% ROA దీనిని ప్రపంచ అగ్రగామిగా నిలిపింది. ఇవ్వన్నీ కూడా బలమైన ప్లాన్, అద్భుతమైన నిర్వహణకు నిదర్శనం.

2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ పర్ఫార్మెన్స్
అదానీ గ్రూప్ 2024-25 ఆర్థిక సంవత్సరం (FY25)లో అద్భుతమైన పర్ఫార్మెన్న్ ఇచ్చింది. ఇప్పటివరకు అత్యధికంగా రూ.89,806 కోట్లు (సుమారు $10.5 బిలియన్లు) EBITDAని రికార్డ్ చేసింది. దింతో అదానీ గ్రూప్ మొత్తం సంపద రూ.6.1 లక్షల కోట్లకు చేరుకుంది, అన్యువల్ లాభం రూ.40,565 కోట్లుగా ఉంది. గత ఆరు సంవత్సరాలలో అదానీ గ్రూప్ కంపెనీలు సంపదను 25% చొప్పున పెంచుకున్నాయి. “2025 ఆర్థిక సంవత్సరంలో 16.5% రిటర్న్ ఆన్ అసెట్స్ (ROA) రికార్డ్ కాగా, ఇది ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగంలో అత్యధికం” అని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ ‘రాబీ’ సింగ్ అన్నారు.
మౌలిక సదుపాయాలు, ఇంధన రంగంలో వృద్ధి
అదానీ గ్రూప్ EBITDAలో 82% ప్రముఖ మౌలిక సదుపాయాల వ్యాపారం నుండి వచ్చింది. ఇందులో అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ ఇంకా అదానీ పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. రవాణా రంగం EBITDA 19% పెరిగి రూ.20,471 కోట్లకు చేరుకుంది, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మౌలిక సదుపాయాల యూనిట్ EBITDA 70% పెరిగి రూ.10,085 కోట్లకు చేరుకుంది. FY25లో కంపెనీ రూ.1.26 లక్షల కోట్లు (కాపెక్స్) ఆర్జించింది, ఇది ఆదానీ గ్రూప్ చరిత్రలో అత్యధికం. అదానీ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ కూడా నిరంతరం బలపడుతోంది. మొత్తం రుణం-EBITDA రేషియో FY19లో 3.8x నుండి FY25లో 2.6xకి తగ్గింది. అదానీ గ్రూప్ వద్ద రూ.53,843 కోట్ల నగదు ఉంది, అంటే మొత్తం అప్పులో 18.5%. గ్రూప్ సగటు రుణ వ్యయం FY25లో 7.9%గా ఉంది, ఇది FY24లో 9% ఇంకా FY19లో 10.3% నుండి పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ ఆదాయాలలో 90% AA లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఆస్తుల నుండి వస్తున్నాయి.
ముంద్రాలో కొత్త రాగి తయారీ కర్మాగారం
అదానీ గ్రూప్ కంపెనీలు తాజాగా గొప్ప పని చేశాయి. అదానీ గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 14,243 మెగావాట్లకు పెంచుకుంది. దింతో అదానీ పవర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 17.5 గిగావాట్లకు (GW) చేరుకుంది. అదానీ పోర్ట్స్ ఈ సంవత్సరం 450 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) సరుకును తరలించింది. ఇటీవల ప్రారంభించిన విజింజం పోర్టు కేవలం 4 నెలల్లోనే 1 లక్ష కంటైనర్లను (TEU) నిర్వహించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4263 మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ విక్రయించింది. ఇది కాకుండా ముంద్రాలో కొత్త రాగి తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధికి సహాయం చేయడంతో పాటు మంచితనాన్ని కొనసాగించడం అదానీ గ్రూప్ కల. ఇప్పుడు ఈ కల వాస్తవికత వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Ahmed Sharif Chaudhry : మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం.. పాక్ సైనిక ప్రతినిధి హెచ్చరిక