हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

తిమింగళం నోటిలో పడిన బోటు..

Vanipushpa
తిమింగళం నోటిలో పడిన బోటు..

సముద్ర ప్రయాణం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో.. అప్పుడప్పుడూ అంతే స్థాయిలో భయాన్నీ కలిగిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా సొర చేపలు, తిమింగళాల రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది. చాలా మంది వీటిబారిన పడి ప్రాణాలను పోగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోటుపై షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిపై తిమింగళం దాడి చేసింది.

వీడియో తెగ వైరల్
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చిలీలోని పటగోనియా సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డేల్, ఆడ్రియన్ అనే తండ్రీకొడుకులు కలిసి చిన్న చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగళం అటాక్ చేసింది. చూస్తుండగానే ఒక్కసారిగా నీటి పైకి వచ్చి నోరు తెరచింది. దీంతో ఆ వ్యక్తి చూస్తుండగానే పడవతో పాటూ అందులోకి వెళ్లిపోయాడు.

బోటుతో సహా నీటిపైకి ..
కొడుకును తిమింగళం మింగేయడం చూసిన డేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే అంతలోనే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. తిమింగళం నోటిలో చిక్కుకున్న ఆడ్రియన్.. కాసేపటికి బోటుతో సహా నీటిపైకి వచ్చేశాడు. కొడుకును ప్రాణాలతో బయటికి రావడం చూసి తండ్రి డేల్ ఎంతో సంతోషించాడు. ఈడుకుంటూ వెళ్లిన కొడుకు.. తండ్రి పడవను పట్టుకున్నాడు. కొడుక్కు ధైర్యం చెప్పిన తండ్రి.. పడవను వేగంగా నడుపుతూ దూరంగా తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 1.96 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870