చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చైనా అధికారిక జిన్హువా వార్తా సంస్థ ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు హెబీ ప్రావిన్స్‌లోని చెంగ్డే నగరంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత (ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో) 20 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు
ఆ నర్సింగ్ హోమ్‌లోని మిగిలినవారిని పరిశీలన, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి, అనంతర సంరక్షణ అందించడానికి హెబీ ప్రావిన్స్, చెంగ్డే నగర అధికారులు నిపుణుల బృందాలను సంఘటనా స్థలానికి పంపారని జిన్హువా వార్తా సంస్థ రిపోర్టు చేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిననర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని… అయితే ఆ వ్యక్తి గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.