हिन्दी | Epaper

రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ హతం

Vanipushpa
రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ హతం

రష్యా, ఉక్రెయిన్ దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా స్కూటర్ బాంబు పేలడంతో రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ప్రాణాలు కోల్పోయారు. తన నివాసం నుంచి బయటకు అడుగు రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ హతం
పెడుతుండగా బాంబు పేలింది. దీంతో కిరిల్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కిరిల్లోవ్, ఆయన సహాయకుడు ఇంట్లో నుంచి బయటకు రావడం, బాంబు పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
తామే హత్య చేశాం: ఉక్రెయిన్
కాగా, ఇగోర్ కిరిల్లోవ్ ను తామే హత్య చేసినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. తమ భూభాగంపై నిషేధిత రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కిరిల్లోవ్ అనుమతించారని ఆరోపించాయి. దీనికి ప్రతీకారంగానే ఆయనను తుదముట్టించినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్ బీయూ) ఏజెంట్లు మాస్కోలోని కిరిల్లోవ్ నివాసం ముందు స్కూటర్ బాంబును ప్లాంట్ చేశారని తెలిపాయి. ఈమేరకు ఎస్ బీయూ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. కిరిల్లోవ్ తన నివాసం నుంచి బయటికి రాగానే పటిష్టమైన ప్రణాళికతో హతమార్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870