हिन्दी | Epaper

పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి

Sudheer
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని సహచరులు కాల్పులకు పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పది రోజుల క్రితం కూడా పాక్ లో ఆత్మాహుతి దాడి జరిగి 27 మంది మృతి చెందగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌పై నవంబర్ 09 న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా..ఇందులో 14మంది భద్రతాసిబ్బంది ఉన్నారు. మరో 62 మంది గాయపడ్డారు. ప్లాట్‌ఫామ్‌ నుంచి ఓ రైలు పెషావర్‌కు బయలుదేరుతుండగా పేలుడు సంభవించింది.

రైల్వే స్టేషన్​లోని బుకింగ్ కార్యాలయంలో దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు క్వెట్టా డివిజన్ కమిషనర్ హంజా సఫ్తాక్​ తెలిపారు. దుండగుడు లగేజ్​తో రైల్వే స్టేషన్​లోకి వచ్చాడని చెప్పారు. అయితే ఆత్మాహుతి దాడి చేయడానికి వచ్చే వారికి నిలువరించడం కష్టమని అన్నారు. కాగా, పేలుడు ధాటికి ప్లాట్​ఫామ్​ పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు శబ్ధం నగరంలోని వివిధ ప్రాంతాలకు వినిపించింది. ఈ దాడికి బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ- బీఎల్​ఏ బాధ్యత వహించింది. బీఎల్​ఏను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలూచిస్థాన్​లోని వనరులను పాకిస్థాన్​ కేంద్ర ప్రభుత్వం దండుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని బీఎల్​ఏ ఆరోపించింది. వీటిని పాక్​ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇక్కడి వారితో కలిసి విదేశీ శక్తులు చేస్తున్న కుట్రగా అభివర్ణించింది.

కాగా, పాకిస్థాన్​లో ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో గత ఏడాది కాలంలో ఇలాంటిఘటనలు పెరిగాయి. సెంటర్​ ఫర్​ రీసెర్చ్​ అండ సెక్యురిటీ స్టడీస్​(CRSS) ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పాకిస్థాన్​లో హింసాత్మక ఘటనలు 90శాతం పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870