విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government)కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. దీనిలో భాంగంగా విద్యార్థులకు అవసరం అయ్యే బ్యాగు,యూనిఫామ్, పుస్తకాలు, షూస్, డిక్షనరీ వంటి వాటిని ఉచితంగా అందిస్తోంది. ఇవన్ని గత ప్రభుత్వంలోనే అమలులో ఉన్నా ఆసల్యంగా స్కూళ్లు తెరిచిన తర్వాత పంపిణీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పాఠశాలలు తెరిచేలోపే విద్యార్థులకు ఈ కిట్లు అందించాలని నిర్ణయించుకుని ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇక ఇప్పటికే మే నెలలోనే చాలా వరకు జిల్లా కేంద్రాలకు ఈ కిట్లు చేరుకున్నాయి. ఇలా ఉండగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
పూర్తి వివరాలు
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా విద్యామిత్ర కిట్లు ఇవ్వలని నిర్ణయించింది.గత ప్రభుత్వ హయాంలో కేవలం స్కూల్ విద్యార్థులకు మాత్రమే కిట్లు ఇచ్చేవారు. ఇంటర్ విద్యార్థులకు వీటిని ఇవ్వలేదు. కానీ కూటమిప్రభుత్వం మాత్రం ఇంటర్ విద్యార్థుల(Inter Students)కు కూడా కిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కిట్లను అందించేందుకు రెడీ అయ్యింది. ఇక వీరికి కూడా కాలేజీ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్ అన్ని ప్రభుత్వం నుంచే అందుతాయి.విద్యార్థులకు అవసరమైన బ్యాగు, పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్, డిక్షనరీ, షూస్ వంటి వాటిని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్’ పేరిట ప్రతి విద్యార్థికి అందిస్తుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో(Aided schools) చదివే స్టూడెంట్స్ అందరికి వీటిని పంపిణీ చేయనుంది. అలానే ఈ కిట్ల మీద ఏ రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా పంపిణీ చేస్తుంది. దీంతోపాటుగా కిట్‌లోని వస్తువులపై ప్రత్యేక గుర్తింపు నంబర్‌ను ముద్రించారు.

విద్యార్థి మిత్ర
విద్యామిత్ర కిట్‌లో ఇచ్చే బ్యాగు, షూస్, బెల్టులపై ప్రత్యేక నంబర్(Special Number) వస్తుంది. దీని ద్వారా ఆయా వస్తువులను ఏ సంస్థ సరఫరా చేసింది అవి ఏ జోన్‌కు చెందినవి అనే వివరాలు తెలుస్తాయి. అంతేకాక బెల్ట్, షూస్, బ్యాగ్ నాణ్యత సరిగా లేకపోయినా ఎవరైనా వాటిని దుర్వినియోగం చేసినా ఈ ప్రత్యేక నంబర్ ఆధారంగా వెంటనే గుర్తించవచ్చు అంటున్నారు. కిట్‌లో ఇచ్చే వస్తువులపై లోగోతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) విద్యార్థి మిత్ర అని ముద్రించారు. పాఠశాలలు తెరిచే నాటికి వీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Chandrababu : సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు: చంద్రబాబు