हिन्दी | Epaper

Inter Results: ఆంధ్రలో రేపే ఇంట‌ర్ ఫ‌లితాలు

Sharanya
Inter Results: ఆంధ్రలో రేపే ఇంట‌ర్ ఫ‌లితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫస్టియర్ మరియు సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

నారా లోకేశ్ ప్రకటన

శుక్రవారం నాడు మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తాం. ఒకేసారి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించబోతున్నాం, అని తెలిపారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఎదురుచూపులు ముగిశాయి. ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు- https://resultsbie.ap.gov.in అంతేకాదు, ఫలితాలను తెలుసుకునే మరొక సులభమైన మార్గం కూడా ఉంది. మీ మొబైల్ ఫోన్‌లో  హాయ్  అని మెసేజ్‌ను మన మిత్ర నంబర్ 9552300009కు పంపితే, వెంటనే మీ ఫలితాన్ని పొందవచ్చు. ఇది విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ సౌకర్యం. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. అందులోనూ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఇంకా పెరిగింది. ప్రవేశ పరీక్షలు, డిగ్రీ కోర్సులు మొదలగు తదుపరి విద్యా అవకాశాలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది.

వాట్సాప్ ద్వారా..
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read also: Tenth Results : ఏప్రిల్ 22న ఏపీ టెన్త్ ఫలితాలు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

పుంగనూరులో విషాదం: బైక్ పొగతో ఊపిరాడక నలుగురు మృతి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870