వాట్సాప్ లో ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు

వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్‌టికెట్లు

ఇంటర్ హాల్‌టికెట్ల ను వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
గతంలో ప్రైవేటు విద్యాసంస్థలు సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసి ఇబ్బందుల‌కు గురిచేసేవి. ఇప్పుడు అలాంటి కష్టాలు విద్యార్థులకు ఉండవు. ఇకపై ఇంటర్‌ హాల్‌ టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళ‌న లేకుండా పరీక్షలు రాసుకోవచ్చు.

Whatsapp Feature

ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు 9552300009 నంబర్‌ ద్వారా నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చ‌ని ప్రభుత్వం తెలిపింది. ఇలా వాట్సప్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం త్వరలో పదవ తరగతికి కూడా కల్పించనున్నారు.

వాట్సప్‌ నుండి మీ హాల్ టికెట్ ని ఈ విధంగా డౌన్లోడ్ చేస్కోండి:
-మొదట ఫోన్‌లో వాట్సప్‌ గవర్నెన్స్‌ ఏపీ నెంబర్‌ 9552300009 సేవ్‌ చేసుకోవాలి
-తర్వాత సెర్చ్‌ బాక్స్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్‌ లేదా హాయ్‌ అని టైప్ చేయాలి
-మీకు మనమిత్ర వాట్సప్‌ గర్ననెన్స్‌ నుంచి రిప్లయ్‌ వస్తుంది
-ఆ మెసేజ్‌లో కింద స‌ర్వీసును ఎంచుకునే ఆప్షన్‌ వస్తుంది
-అనంతరం ఆ స‌ర్వీసుల‌లో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్‌ కనిపిస్తుంది
-అక్కడ క్లిక్‌ చేసి విద్య సేవలు అనే ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి
-అనంతరం సెలక్ట్‌ హాల్‌టికెట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది
-అందుబాటులో ఉన్న హాల్‌టికెట్ల గ్రీన్‌ సింబల్‌ కనిపిస్తుంది
-మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి
-అనంతరం రోల్‌ నంబర్‌, ఫస్టియర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేది వంటి వివరాలు ఎంటర్ చేయాలి
-మీ హాల్‌టికెట్‌ డిస్‌ప్లే అవుతుంది డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చ
.

ఇక వార్షిక ప‌రీక్ష‌లలో భాగంగా మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలు జ‌ర‌గుతాయి. అలాగే మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది.

Related Posts
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CBN Nellour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ Read more

రేపు స్కూళ్లకు సెలవు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో MLC ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు (ఫిబ్రవరి 27) సెలవు ప్రకటించారు. ముఖ్యంగా గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల Read more

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
liquor sales in telangana jpg

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. Read more

హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు
హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

కేసరిపల్లి గ్రామం గన్నవరం మండలం, కృష్ణాజిల్లా నందు ది 05.01.2024 జరగబోవు హైందవ శంఖారావం మహాసభ పురస్కరించుకొని ఈ క్రింది విధంగా పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చేయడమైనది.హైందవ Read more