ఇండోనేషియా(Indonesia)లోని రిసార్ట్ ద్వీపం బాలి(Bali)లో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న KMP తును ప్రతామ జయ అనే పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది.
బుధవారం రాత్రి తూర్పు జావా(Javaa)లోని కేతాపాంగ్(Kethapang) ఓడరేవు నుండి బయలుదేరిన దాదాపు అరగంట తర్వాత KMP తును ప్రతామ జయ అనే బోటు మునిగిపోయిందని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పడవ బాలిలోని గిలిమనుక్ ఓడరేవు వైపు 50 కిలోమీటర్ల దూరం వెళుతోంది.

మృతులు & గల్లంతైన వారు
రెస్క్యూ ఏజెన్సీ ప్రకారం, ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 14 ట్రక్కులు సహా 22 వాహనాలు ఉన్నాయి. బన్యువాంగి పోలీసు చీఫ్ రామ సమతమ పుత్ర మాట్లాడుతూ.. రెస్క్యూ టీం ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను కనుగొన్నారని.. మరో 23 మందిని రక్షించారని చెప్పారు. వీరంతా నీటిలో మునిగిపోయిన తర్వాత అపస్మారక స్థితిలో కనిపించారని తెలిపారు. ఈ ఘటన రాత్రి 11:20 గంటలకు జరిగినట్లు అంచనా వేశారు. ఇండోనేషి గల్లంతైన వారిలో కొందరు మహిళలు, పిల్లలు ఉన్న అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా డైవర్లు రంగంలోకి దించబడ్డారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది
ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఆధ్వర్యంలో అత్యవసర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో పడవ బాలి ద్వీపంలోని గిలిమనుక్ ఓడరేవు వైపు 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రమాద సమయం సుమారు రాత్రి 11:20 గంటలుగా అంచనా వేయబడింది.
Read Also: Thailand PM : ఒక్క రోజు ప్రధానిగా సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ బాధ్యతలు