పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన టర్కీ, అజర్బైజాన్(Turkey and Azerbaijan)లు ఇప్పుడు.. తలలు పట్టుకుంటున్నాయి. అసలు ఎందుకు పాక్(Pak)కు సపోర్ట్ చేశామా అనే సందిగ్ధంలో పడ్డాయి. ఎందుకంటే భారత్(Bharath)చేసిన దాడులను వ్యతిరేకిస్తూ.. పాక్ వైపు నిలబడిన ఈ రెండు దేశాలకు.. భారత ప్రభుత్వంతోపాటు భారతీయులు కూడా వరుస షాక్‌లు ఇస్తున్నారు. టర్కీ, అజర్బైజాన్(Turkey and Azerbaijan)లకు వెళ్లే టూరిస్ట్(Tourist)లు భారీగా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశాల వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు గణాంకాలు వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే టర్కీ, అజర్‌బైజాన్‌లకు ట్రావెల్, రూమ్ బుకింగ్‌లు నిలిపివేసినట్లు పలు ఆన్లైన్ బుకింగ్ సంస్థలు వెల్లడించాయి. ఆ దేశాల కంపెనీలకు కూడా భారత్‌లో బిగ్ షాక్‌లు తగులుతున్నాయి.

వీసా దరఖాస్తుల్లో ఏకంగా 42 శాతం భారీ క్షీణత
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో వేలు పెట్టిన టర్కీ, అజర్‌బైజాన్‌లకు వీసా దరఖాస్తుల్లో ఏకంగా 42 శాతం భారీ క్షీణత నమోదైనట్లు మంగళవారం వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫాం అట్లీస్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ రెండు దేశాలు పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో భారతీయ టూరిస్ట్‌లు వెంటనే ప్రతిస్పందించారు. కేవలం 36 గంటల్లోనే వీసా దరఖాస్తు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన యూజర్ల సంఖ్య 60 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే వీసా దరఖాస్తులు రద్దు చేసుకున్న వారు.. చాలా క్లారిటీగానే ఉన్నారని.. వారంతట వారే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అట్లీస్ ఫౌండర్, సీఈఓ మోహక్ నహ్తా అన్నారు.
భారత్‌కు, దేశీయ సెంటిమెంట్‌కు మద్దతుగా..
అదే స్ఫూర్తితో తాము కూడా టర్కీ, అజర్బైజాన్ల కోసం అన్ని మార్కెటింగ్ ప్రయత్నాలను నిలిపివేసి.. భారత్‌కు, దేశీయ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచామని అట్లీస్ సీఈఓ మోహక్ నహ్తా తెలిపారు. ఫ్యామిలీ టూర్లతోపాటు, గ్రూప్ వీసా అప్లికేషన్లు దాదాపు 49 శాతం తగ్గాయని తెలుస్తోంది. సోలో, కపుల్ అప్లికేషన్స్ కూడా 27 శాతం తగ్గాయి. టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు బదులుగా ఇప్పుడు చాలా మంది భారతీయులు థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఈజిప్ట్ వంటి దేశాల వీసాల కోసం అప్లికేషన్స్ పెరిగినట్లు డేటా చూపిస్తోంది.
ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి టర్కీకి వెళ్లే దరఖాస్తులలో 53 శాతం క్షీణత కనిపించగా.. ఇండోర్, జైపూర్ వంటి టైర్ 2 నగరాల నుంచి కేవలం 20 శాతం మాత్రమే తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. భారత్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల్లో పాకిస్తాన్‌కు మద్దతు తెలిపి వేలు పెట్టిన టర్కీ, అజర్బైజాన్ల టూరిజం ఒక్క దెబ్బతో ఏ స్థాయికి పడిపోయిందో దీంతో అర్థం అవుతోంది.
పాకిస్తాన్‌కు టర్కీ, అజర్ బైజాన్, చైనా దేశాలు మద్దతు
ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు టర్కీ, అజర్ బైజాన్, చైనా దేశాలు మద్దతు తెలిపాయి. టర్కీ ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా తన డ్రోన్లను భారత్‌పై ప్రయోగించేందుకు పాకిస్తాన్‌కి అందించింది. అంతేకాకుండా వాటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పంపించింది. అయితే భారత్ జరిపిన దాడుల్లో ఆ ఇద్దరు టర్కీష్ వ్యక్తులు కూడా మరణించారని తెలుస్తోంది.
Read Also: Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్