పశ్చిమాఫ్రికాలోని మాలి(Mali)లో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరుల(Indians Citizens)ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదా(Al qaeda)తో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం(Indian Government) ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్ అయిన భారతీయులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జులై 1న కొందరు ఉగ్రవాదులు మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. జూలై 1న పశ్చిమాఫ్రికాలోని మాలి(Mali)లో తీవ్రవాదులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు. ఈ దాడుల్లో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు.

జవాబుదారిగా అల్ ఖైదా అనుబంధ గ్రూప్
అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులును కిడ్నాప్ చేశారు. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నామని విదేశాంగ శాఖ తెలిసింది. కిడ్నాప్ అయిన వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే మాలిలో ఉంటున్న ఇతర భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఏదైనా అవసరం ఉంటే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. మాలిలో ఉన్న ఇతర భారతీయులను అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. కిడ్నాప్ ఘటనను సమీపంగా గమనిస్తున్నాము, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Pakistan : పాక్ లో మరోసారి ఉగ్రదాడి : ఐదుగురి మృతి