ముందస్తు కాన్పుల కోసం భారతీయ మహిళల ప్రయత్నాలు

ముందస్తు కాన్పుల కోసం భారతీయ మహిళల ప్రయత్నాలు

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయుల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే జన్మతః పౌరసత్వ నిబంధనను రద్దు చేసేసిన ట్రంప్.. కొన్నేళ్గుగా అమెరికాకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిని స్వదేశాలకు తరిమేస్తున్నారు. దీంతో వలసదారుల్లో భయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జంటలు తాజాగా పలు చోట్ల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వ నిబంధనపై ఇప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వెంటనే దీన్ని అమలు చేయకుండా కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అయినా పంతం నెగ్గించుకునేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయ జంటల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ముఖ్యంగా పిల్లల్ని మోస్తున్న తల్లుల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు కాన్పుల కోసం భారతీయ మహిళల ప్రయత్నాలు

సిజేరియన్ ఆపరేషన్లు కోరుతున్నారు

ట్రంప్ ఆశించిన విధంగా జన్మతః పౌరసత్వం లభించకపోతే తమ పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న వారంతా.. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయ జంటలు, ముఖ్యంగా పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉన్న వారు.. త్వరలో సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ పిల్లల్ని ఈ నిబంధన పరిధిలోకి రాకుండా చూడాలనేది వారి ఉద్దేశం.

సిజేరియన్ ఆపరేషన్లు చట్టవిరుద్ధం

అయితే అమెరికా చట్టాల ప్రకారం ఇలా ముందస్తుగా సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకోవడం అక్రమమని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపీ) అధ్యక్షుడు సతీష్ కత్తుల చెప్తున్నారు. కఠినమైన వైద్య చట్టాలు ఉన్న దేశంలో పౌరసత్వం కోసం ముందస్తు సి-సెక్షన్‌లు వద్దని ఆయన సూచిస్తున్నారు. దీని ద్వారా ఓ చిక్కు నుంచి బయటపడేందుకు ప్రయత్నించి మరిన్ని చిక్కుల్లో పడొద్దని భారతీయుల్ని కోరుతున్నారు. మరోవైపు అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వం ఇవ్వకపోతే వాళ్లు చట్టపరంగా అనిశ్చితిని ఎదుర్కుంటారని న్యూయార్క్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ సైరస్ మెహతా తెలిపారు.

Related Posts
భారత్‌పై ట్రంప్ ఒత్తిడి
ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల అమలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం సహా అనేక అంశాలపై Read more

సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ లబ్ది
Sunny Leone

ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో Read more

మణిపూర్ హింస: అమిత్ షా మహారాష్ట్రలో ర్యాలీ రద్దు
amitsha

మణిపూర్‌లో పరిస్థితి మరింత తీవ్రం కావడంతో, కేంద్ర హోంశాఖ మంత్రి గా ఉన్న అమిత్ షా ఆదివారం తన మహారాష్ట్రలో ఉన్న ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు Read more

భారత్ మరింత బాధ్యత వహించాలి: 2024 ఫాసిల్ ఇమిషన్లు నివేదిక
Climate Carbon Removal  81291

భవిష్యత్ లో వాతావరణ మార్పులపై ప్రభావం చూపిస్తున్న కార్బన్ డైఆక్సైడ్ (CO2) ఉత్పత్తి ప్రస్తుతానికి అన్ని దేశాలలో పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఫాసిల్ ఇనర్జీ Read more