ట్రంప్ పాలనలో చెదిరిపోతున్న భారతీయ విద్యార్థుల డాలర్ కలలు

Donald Trump: ట్రంప్ పాలనలో చెదిరిపోతున్న భారతీయ విద్యార్థుల డాలర్ కలలు

భారత ప్రభుత్వ డేటా ప్రకారం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు అమెరికా…’అత్యంత ఇష్టపడే దేశాలలో ఒకటి’ అని తెలుస్తోంది. 2024లో 7.5 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో 2 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అంటే దాదాపు 27 శాతం మంది. అయితే, 2023లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ముఖ్యంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2024లో చాలా తగ్గింది. ఇంతలో ఒక వార్త వచ్చింది, అమెరికాలో చదువుకోవడానికి మంజూరు చేసిన వీసాల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.

Advertisements
v

అమెరికా క్యాంపస్‌లలో అనిశ్చితి
అయితే, డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధాన సమీక్షలు, యూనివర్సిటీలకు నిధుల వ్యవస్థలో మార్పులు, కొంతమంది విద్యార్థుల అరెస్టు వంటి అంశాలు ప్రముఖంగా కనిపించాయి. అమెరికా
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న తేజస్ హరాద్ 2023లో ఇండియా నుంచి అక్కడికి వెళ్లారు. గత కొన్నివారాలుగా క్యాంపస్‌లో అనిశ్చితి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రతిరోజూ మాకు కొత్త ఆదేశాల సమాచారం అందుతోంది. రేపు ఏం జరగబోతుంది? వచ్చే ఏడాది ఏం జరుగుతుంది? యూనివర్సిటీల నిధులలో కోతలు…అనేది అనేక రకాల వార్తలను అర్ధం చేసుకోవడం విద్యార్థులకు కష్టమవుతోంది.

పరిశోధన నిధులను తగ్గించనున్నట్లు ప్రభుత్వ ప్రకటన

గత రెండు నెలలుగా, అమెరికన్ విశ్వవిద్యాలయాల కష్టాలకు తోడుగా, వివిధ కారణాలను చూపుతూ అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఫౌండేషన్‌లు, విశ్వవిద్యాలయాలకు బయోమెడికల్ పరిశోధన నిధులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో యూదు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 3,400 కోట్లు) నిధులను నిలిపివేసింది.

Related Posts
రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ, Read more

కాంగ్రెస్, ఆప్ పొత్తు ఉంటే బాగుండేది: సంజయ్ రౌత్
sanjay raut

కలిసి ఉంటే మొదటి గంటలోనే (లెక్కింపు) బీజేపీ ఓటమి ఖాయం అవుతుంది అని రౌత్ అన్నారు. ఎన్నికల సంఘం (ఈసీ), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని Read more

ఆసుపత్రికి బుమ్రా: కోహ్లీకి కెప్టెన్సీ
ఆసుపత్రికి బుమ్రా: కోహ్లీకి కెప్టెన్సీ

సిడ్నీలోని SCG మైదానంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ రెండవ రోజు విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు Read more

జమిలి బిల్లుపై జేపీసీ బాధ్యతలు ఏమిటి?
Election

దేశ వ్యాపితంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి బిల్ ను జేపీసీకి పంపిన విషయం తెలిసేందే. నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్ ఎన్నికల నిర్వహణ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *