అమెరికా(America)లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ(Spelling Bee) పోటీల్లో హైదరాబాద్(Hyderabad) మూలాలున్న బాలుడు సత్తాచాటాడు. టెక్సాస్(Taxas)లో ఉంటున్న 13 ఏళ్ల ఫైజాన్ జాకీ 21వ రౌండ్‌లో స్క్రిప్స్ నిర్వాహకులు అడిగిన “ఎక్‌లే సీస్‌మా” అనే ఫ్రెంచి పదం స్పెల్లింగ్‌ను సరిగ్గా చెప్పి విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాకు చెందిన మరో భారతసంతతి బాలుడు సర్వజ్ఞ కదమ్‌పై జాకీ పైచేయి సాధించాడు. ఇప్పటి వరకు 4 సార్లు స్పెల్లింగ్‌బీ పోటీల్లో పాల్గొన్న జాకీ, గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

ఫైజాన్ జాకీ ఛాంపియన్‌గా
తాజా పోటీలో విజేతగా నిలవడం వల్ల 50,000 డాలర్ల నగదు, ట్రోఫీ సహా మెరియమ్ వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని జాకీ అందుకున్నాడు. తన విజయాన్ని తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌లో ఉండే తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తానని జాకీ తెలిపాడు. ఈ క్షణాన్ని ఊహించలేదని హర్షం వ్యక్తంచేశాడు. 1925లో స్పెల్లింగ్-బీ పోటీలను ప్రారంభించగా, 100వ పోటీలో ఫైజాన్ జాకీ ఛాంపియన్‌గా నిలిచాడు.
Read Also: America: తెలుగు విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయా?