భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం నాటింగ్‌హామ్ వేదికగా
భారత మహిళల క్రికెట్ జట్టు మరో సవాలుతో ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమైంది. ఐదు టీ20లతో పాటు మూడు వన్డేలు కలిగిన ఈ సిరీస్‌లో భాగంగా, హర్మన్‌ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) నాయకత్వంలోని జట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ శనివారం (జూన్ 29) నాటింగ్‌హామ్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఇంగ్లండ్ చేరి సన్నాహకాలు పూర్తి చేసుకుంది. జూలై 1, 4, 9, 12న తర్వాతి నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.భారత్, ఇంగ్లండ్ మహిళల టీ20, వన్డేల సిరీస్‌లకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ స్పోర్ట్స్1 ఛానెల్‌తో పాటు సోనీ లైవ్ యాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఫ్రీగా చూడాలంటే జియో యూసర్జ్ జియో టీవీ (Jio TV) యాప్‌లో సోనీ స్పోర్ట్స్ 1 ఛానెల్ సెలెక్ట్ చేసుకోని చూడాలి. ఎయిర్టెల్ యూజర్స్ ఎయిర్టెల్ టీవీ యాప్‌లో చూడవచ్చు.
ఈ సిరీస్ ప్రాధాన్యత ఎంతో
ఈ పర్యటన భారత మహిళల జట్టు కోసం కీలకం కానుంది. ఇటీవల మంచి ఫార్మ్‌లో ఉన్న టీమిండియా, ఇంగ్లండ్ జట్టును వారి సొంత గడ్డపైనే ఎదుర్కొనబోతుండడం మరో సవాల్. ముఖ్యంగా టీ20 సిరీస్ (T20 series) ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సిరీస్ ప్రాధాన్యత ఎంతో ఉంది.ఇంగ్లండ్ వేదికగా ఆడటమంటే ఖచ్చితంగా పరిస్థితులకు అనుగుణంగా మెలగడం చాలా ముఖ్యం. పిచ్‌లు సాధారణంగా స్వింగ్‌కు అనుకూలంగా ఉండటం, వాతావరణం చల్లగా ఉండటం భారత ఆటగాళ్లకు కొంత సవాలుగా మారవచ్చు.

భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ(Deepti Sharma), అరుంధతి రెడ్డి, శ్రీ చరాణి, యస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్.
ఇంగ్లండ్ జట్టు
నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంకెల్, డెనియెల్ వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్, ఆలిస్ క్యాప్సీ, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్, ఇస్సీ వాంగ్, పైజ్ షాఫీల్డ్, టామీ బ్యూమాంట్, ఎం ఆర్లాట్. భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour) తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేస్తుందా అనే ఆసక్తికర ప్రశ్నకు శనివారం రాత్రి సమాధానం దొరుకుతుంది. రెండు బలమైన జట్లు మైదానంలో తలపడనున్న నేపథ్యంలో అభిమానులకు గొప్ప క్రికెట్ విందు లభించనుంది. ఈ సిరీస్ ద్వారా భారత్ తమ గ్లోబల్ స్థాయిని మరింత పటిష్టం చేసుకుంటుందా అన్నది చూడాలి!
Read Also: Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్ నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ