తుర్కియే(turkiye)కు చెందిన విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ చెలేబీ ఎయిర్‌పోర్ట్ (Airport) సర్వీసెస్ ఇండియా(India)కు భద్రతాపరమైన అనుమతులను భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ (బీసీఏఎస్) రద్దు చేసింది. దీనిపై చెలేబీ ఎయిర్‌పోర్ట్(Celebi Aviation) సర్వీసెస్ ఇండియా స్పందిస్తూ .. ” నిజానికిది భారతీయ నిపుణుల నేతృత్వంలో నిర్వహించే భారతీయ సంస్థ. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది తుర్కిష్ సంస్థ కాదు.” అని తన ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌లో భారత్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండించిన తుర్కియే, పాకిస్తాన్‌కు అండగా నిలవడంతో భారత్ ఈ చర్యలు తీసుకుంది.

15 ఏళ్ల నుంచి చెలేబీ తన సేవలు
భారత్‌లోని తొమ్మిది విమానాశ్రయాల్లో 15 ఏళ్ల నుంచి చెలేబీ తన సేవలను అందిస్తోంది.
‘‘జాతీయ భద్రత దృష్ట్యా, చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు’’ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో కార్యకలాపాలను నిర్వహించే చెలేబీ సంస్థతో తమ భాగస్వామ్యం అధికారికంగా ముగిసినట్లు దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ (డీఐఏఎల్) ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయారు. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 6,7వ తేదీ మధ్యరాత్రి పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడులు చేసినప్పుడు, తుర్కియే అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్ పాకిస్తాన్‌కు సంఘీభావం ప్రకటించారు. దీని తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున వాడినట్లు భారత్ చెప్పింది.
Read Also: Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. తప్పిన ప్రాణాపాయం!