పెరిగిన మందుల ధరలు..900కి పైగా ఓషధాలపై ప్రభావం

Medicines: పెరిగిన మందుల ధరలు..900కి పైగా ఔషధాలపై ప్రభావం

మీరు రోజూ మందులు వేసుకుంటుంటారా.. అయితే మీ మందుల ఖర్చులు కాస్త పెరగనున్నాయి. ఎందుకంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అవసరమైన మందుల ధరలను 1.74% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది, దింతో మందులు వాడే లక్షలాది మందికి వీటి ఖర్చు భారం పెరుగుతుంది. ఈ మందుల ధరల పెరుగుదల కారణంగా క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు అలాగే యాంటీబయాటిక్స్ వంటి మందుల ధరలు పెరిగాయి. వీటిలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, యాంటీ-అలెర్జీ, యాంటీ-అనీమియా, విటమిన్ టాబ్లెట్లు ఇంకా ఖనిజాల మందులు ఉన్నాయి. ఈ మందులను సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ధరలు పెరిగిన మందుల లిస్టులో 800 మందుల పేర్లు ఉన్నాయి.

Advertisements
పెరిగిన మందుల ధరలు..900కి పైగా ఓషధాలపై ప్రభావం

చాలా కాలంగా ధరలను పెంచాలని డిమాండ్
ధరలు ఎందుకు పెంచుతున్నారు: NPPA ప్రకారం, ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవసరమైన మందుల ధరలను సమీక్షిస్తుంది అలాగే ఈసారి కూడా హోల్ సేల్ ప్రయిస్ ఇండెక్స్ (WPI) పెరుగుదల కారణంగా, మందుల కంపెనీలు ధరలను పెంచడానికి అనుమతించాయి. ముడి పదార్థాల ధరలు అంటే మందులు తయారు చేయడానికి ఉపయోగించే పదార్ధాల ధరలు కొంతకాలంగా పెరుగుతున్నాయని, ఈ కారణంగా ధరలు కూడా పెరిగాయని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. అయితే కంపెనీలు చాలా కాలంగా ధరలను పెంచాలని డిమాండ్ చేసాయి.

మందుల ధర పెంపు ప్రభావం
దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఇప్పుడు మందుల కోసం కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగే అవకాశం పెరుగుతుంది. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సామాన్యులకు మందులు కొనడం కాస్త కష్టం కావచ్చు. గత సంవత్సరం కూడా పెరిగిన ధరలు: 2023లో కూడా NPPA మందుల ధరలను 12% వరకు పెంచింది, దింతో ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న రోగులపై అదనపు భారాన్ని మోపింది.

Related Posts
నాగ పౌర్ణమి సందర్బంగా కోట్ల మంది భక్తులు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద Read more

ప్రభల తీర్దానికి అరుదైన గుర్తింపు
prabhala tirdam

సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ఉత్సవాల్లో కోనసీమ ప్రభల తీర్దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలోని Read more

హైటెక్ సిటీ గురించి చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CBNhitech city

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో తెలుగు ప్రజలతో జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను Read more

తిరుపతిలో 144 సెక్షన్‌ అమలు..!
Implementation of Section 144 in Tirupati.

తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×