Andhra Pradesh:కృత్రిమ మేధ తో రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh:కృత్రిమ మేధ తో రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు  రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై ఫోకస్ పెట్టారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్‌ పెట్టాలని అధికారులకు సూచించారు. పన్నుల వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందని, జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని ఆదేశించారు.అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని చేయాలని అధికారులకు సూచించారు.

Advertisements

మొబైల్ నెంబర్

ప్రజా ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలియజేసే సమాచారం అందించాలని, ఇందుకోసం ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారులకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని వివరంగా తెలియజేయాలని సూచించారు.గ్రీవెన్స్‌ల పరిష్కారంపై మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

 Andhra Pradesh:కృత్రిమ మేధ తో  రాష్ట్ర ఆదాయం పెంచండి: సీఎం చంద్రబాబు

ఏఐని వినియోగించి

ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచాలన్నారు. మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చిందని పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: Narendra Modi : తిరుపతి-కాట్పాడి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Related Posts
తీరని వెత…. డోలిమోత
vizag1

-- ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాతవిశాఖపట్నం : ఈ కథ కొత్తది కాదు.. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ.. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, Read more

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
lokesh300cr

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం సా.4.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారని అధికారికంగా తెలియజేశారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి, Read more

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
1500x900 1079640 gandhibabji

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదువెలగపూడి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతో Read more

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా – గవర్నర్ ప్రసంగం, వైసీపీ వాకౌట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ మరియు శాసనమండలిని ఉద్దేశించి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×