हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

Divya Vani M
Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో (In Rayachoti, Annamayya district) ఉగ్రవాద కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు (Two terrorists arrested) చేశారు. ఈ అరెస్టుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అబూబక్కర్‌, మొహమ్మద్‌ అలీ అలియాస్‌ యూసఫ్‌ అనే అన్నదమ్ములు కేరళలోని మేళపలయంకు చెందినవారు. ఈ ఇద్దరు గత ముప్పై ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ పోలీసుల కంటిలో పడకుండా గడిపారు. చివరకు తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) వారికి పట్టేసింది.1995 నుంచి పరారీలో ఉన్న అబూబక్కర్‌ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెలో అమానుల్లా అనే పేరుతో చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు అతన్ని ‘కుట్టీ’ అనే పేరుతో పిలుస్తారు. చుట్టుపక్కలవారికి ఇతని అసలు గతం పూర్తిగా తెలియలేదు.

మొహమ్మద్ అలీ – బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు

ఈ క్రమంలో అతని తమ్ముడు మొహమ్మద్ అలీ 1999లో తమిళనాడు, కేరళల్లో జరిగిన బాంబు దాడుల్లో ప్రధాన నిందితుడు. అతడు రాయచోటి మహబూబ్‌బాషా వీధిలో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయాడు. చీరల వ్యాపారం, చిన్న దుకాణంతో తన అసలైన చరిత్రను దాచే ప్రయత్నం చేశాడు.

వారిపట్ల స్థానికుల అనుమానాలు ఇప్పుడే వెలుగులోకి

ఇప్పటికే పలుమార్లు ఈ ఇద్దరూ కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఎక్కడికైనా వ్యాపారం కోసం వెళ్తామంటూ చెప్పేవారు అని వారు వివరించారు. కానీ ఇప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిజం బయటపడింది.

ఉగ్రవాదులకు ఆశ్రయం గా మారిన పట్టణం – విచారణ ముమ్మరం

ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు ఈ ఇద్దరి పాత సంబంధాలను, స్థానికంగా ఉన్న ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. రాయచోటి వంటి ప్రశాంత పట్టణం ఇలా ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం కలవరపెడుతోంది.

Read Also : Runway Exposed : ఓ తల్లి కొడుకు … వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870