k vijayanandh ap cs

ఉగాది నుంచి పి-4 విధానం అమలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పి-4 విధానంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు, వర్చువల్‌గా పాల్గొన్న జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్స్) విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పి-4 విధానం ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే పి-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు. పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు తదితరులను ఉగాది రోజు జరిగే పి-4 ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానించి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం ద్వారా పి-4 అమలుకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఎస్ తెలిపారు. పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.

hq720

మొదట గా ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పి-4 విధానం అమలు, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ప్రణాళికలో భాగంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా ప్రణాళికల రూపకల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ఎంఎస్ఎంఇ సర్వే నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.స్వర్ణ ఆంధ్ర విజన్-2047లో భాగంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గం, జల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందన్నారు.

Related Posts
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన

వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కత్రాలో 72 గంటల దిగ్బంధనం మాతా వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టు కత్రాలో 72 గంటల దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. స్థానిక Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. "జయకేతనం" పేరుతో నిర్వహించే ఈ సభ Read more

ఆప్‌కి స్వల్ప ఊరట..సీఎం అతిశీ గెలుపు
Small relief for AAP.. CM Atishi's win

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్‎లో చివరి వరకు వెనుకంజలో ఉన్న ఢిల్లీ సీఎం అతిశీ.. అనూహ్యంగా లాస్ట్ Read more

రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
Revanth govt key decision on rythu bharosa?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక Read more