టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్). నోయిడాలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisements

దాడి వివరాలు

ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ శుక్రవారం నోయిడాలో ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకుంది.ఇంటర్వ్యూ జరుగుతుండగానే కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు అకస్మాత్తుగా అభయ్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆయ‌న‌.. త‌న‌కు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు బైఠాయించారు. దీంతో పోలీస్ అధికారులు ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి అక్క‌డి నుంచి పంపించారు.  ఈ ఘ‌ట‌న‌కు ముందు అభ‌య్ సింగే స‌ద‌రు ఛానెల్ యాంక‌ర్‌పై దాడి చేసిన‌ట్లు తెలిసింది. అభయ్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తి.ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు.అయితే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడై తన ఉద్యోగాన్ని వదిలి, సన్యాసాన్ని అంగీకరించారు.మహా కుంభమేళాలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత “ఐఐటీ బాబా”గా ప్రాచుర్యం పొందారు.

iit baba

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ముంబైలోని ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కెనడాలో లక్షల జీతంతో ఉద్యోగం చేశారు. అయితే, ఆధ్యాత్మికతపై ఆసక్తి కారణంగా, ఆ ఉద్యోగాన్ని వదిలి సన్యాసి మార్గాన్ని ఎంచుకున్నారు.

Related Posts
బస్సును ఢీకొట్టిన వ్యాన్‌.. 9 మంది మృతి
bus accident

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు Read more

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం
7.1 magnitude earthquake hits Nepal

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు Read more

విద్యార్థులను విమర్శించినా ప్రశాంత్ కిషోర్
విద్యార్థులను విమర్శించినా ప్రశాంత్ కిషోర్

బీపీఎస్సీ 70వ ప్రిలిమినరీ పరీక్షను మళ్లీ నిర్వహించాలి అని, నితీష్ కుమార్‌తో సమావేశం కావాలి అని డిమాండ్ చేస్తూ బీపీఎస్సీ అభ్యర్థులు ఆదివారం గాంధీ మైదానంలో నిరసనకు Read more

Sunita Williams: సరదాగా పెంపుడు కుక్కలతో గడిపిన సునీతా విలియమ్స్‌
సరదాగా పెంపుడు కుక్కలతో గడిపిన సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో Read more

×