టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్). నోయిడాలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాడి వివరాలు

ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ శుక్రవారం నోయిడాలో ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకుంది.ఇంటర్వ్యూ జరుగుతుండగానే కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు అకస్మాత్తుగా అభయ్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆయ‌న‌.. త‌న‌కు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు బైఠాయించారు. దీంతో పోలీస్ అధికారులు ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి అక్క‌డి నుంచి పంపించారు.  ఈ ఘ‌ట‌న‌కు ముందు అభ‌య్ సింగే స‌ద‌రు ఛానెల్ యాంక‌ర్‌పై దాడి చేసిన‌ట్లు తెలిసింది. అభయ్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తి.ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు.అయితే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడై తన ఉద్యోగాన్ని వదిలి, సన్యాసాన్ని అంగీకరించారు.మహా కుంభమేళాలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత “ఐఐటీ బాబా”గా ప్రాచుర్యం పొందారు.

iit baba

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ముంబైలోని ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కెనడాలో లక్షల జీతంతో ఉద్యోగం చేశారు. అయితే, ఆధ్యాత్మికతపై ఆసక్తి కారణంగా, ఆ ఉద్యోగాన్ని వదిలి సన్యాసి మార్గాన్ని ఎంచుకున్నారు.

Related Posts
భారతదేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ సంస్థను ఎందుకు స్థాపించలేదు?
public policy school

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ దేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ పాఠశాలలను స్థాపించలేకపోయింది. అమెరికా మరియు యూరోప్ దేశాలు జాన్ ఎఫ్. Read more

ప్రతి రూపాయికి 2.52 రూపాయలు: ఇస్రో చీఫ్
ప్రతి రూపాయికి 2.52 రూపాయలు: ఇస్రో చీఫ్

భారతదేశం అంతరిక్షంలో వెచ్చించే ప్రతి రూపాయికి రూ. 2.52 చేసింది: ఇస్రో చీఫ్ భారతదేశం అంతరిక్ష రంగంలో మైలురాయి ప్రతిపాదనను ఈ సంవత్సరం వెల్లడించింది. భారత అంతరిక్ష Read more

బిహార్: బ్యాంకు అప్పుల ఒత్తిడి, విషం తాగిన కుటుంబం
suicide

బిహార్ రాష్ట్రంలో ఓ కుటుంబం ఆర్థిక ఒత్తిడి కారణంగా విషాదాన్ని ఎదుర్కొంది. ఈ సంఘటన బంకా జిల్లా లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వీరిలో ఒకరు, Read more

మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నప్రధాని మోడీ..!
Prime Minister Modi is going to visit Russia again.

‘గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌’ వార్షికోత్సవానికి ప్రధాని న్యూఢిల్లీ: మరోసారి భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడ జరగనున్న "గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌" 80వ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *