bhajanlal sharma

మతం మారితే జైలు శిక్షతోపాటు జరిమానా

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు రాజస్థాన్‌లోని భజన్ లాల్ శర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ద మత మార్పిడి నిషేధ బిల్లు 2024 రాజస్థాన్ ప్రోహిబిషన్ ఆఫ్ అన్ లా‌ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2025ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే గతేడాది అంటే 2024, నవంబర్‌లో ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ‌ఆమోదించిన సంగతి తెలిసిందే. మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకోన్న వారు.. దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలిపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు చోటు చేసుకొంటున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు చేపట్టనుంది. ఓ వేళ షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఇక ఈ మత మార్పిడి నిరోధక బిల్లుపై రాజస్థాన మంత్రి కె.కె.బిష్ణోయ్ మాట్లాడుతూ.. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా అమాయక బాలికలను ప్రలోభపెట్టడాన్ని ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు.

Related Posts
పులివెందులలో నాటు తుపాకీతో కాల్పులుపుల
పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్లో ఘర్షణ. తుమ్మలపల్లి కి చెందిన కోరా నాగిరెడ్డి పై బబ్లు అనే వ్యక్తి దాడి. నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిందితుడి కోసం గాలింపు

పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్లో ఘర్షణ. తుమ్మలపల్లి కి చెందిన కోరా నాగిరెడ్డి పై బబ్లు అనే వ్యక్తి దాడి. నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో Read more

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!
ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

నేటి కాలంలో ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కంపెనీల వ్యవస్థాపకులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం యువతను 70-90 గంటల వరకు పనిచేయాలని Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ప్రత్యక్ష పన్ను వసూలు..
IDFC First Bank direct tax collection

ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి ), భారత ప్రభుత్వం తరపున ప్రత్యక్ష పన్ను వసూలు చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్‌తో తమ ఏకీకరణ Read more

ఓటీటీలోకి సూరజ్ ఆర్. బర్జాత్య
Suraj R into OTT. Barjatya

OTT ప్రపంచంలోకి సూరజ్ R. బర్జాత్య అడుగుపెడుతున్నందున, ప్రేమ మరియు కుటుంబం యొక్క నిరంతర మాయలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. హృద్యమైన కథలు మరియు కుటుంబ విలువలతో Read more