Los Angels Olympics: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వేదిక ప్రకటించిన ఐసీసీ

Los Angels Olympics: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వేదిక ప్రకటించిన ఐసీసీ

దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగబోయే విశ్వ క్రీడల్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ నిర్వహించనున్నారు. అయితే ఈ క్రికెట్ పోటీల్లో ఆరు జట్లు పాల్గొంటాయని తాజాగా నిర్వాహాకులు నిర్ణయించారు. ఆతిథ్య దేశమైన అమెరికా నేరుగా పాల్గొనే అవకాశం ఉండగా మిగతా జట్ల ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.టీ20 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో  పురుషుల, మహిళల విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ పోటీల్లో ఎన్ని జట్లు పాల్గొనాలనే దానిపై నిర్వాహకులు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఆరు జట్లు పోటీలో పాల్గొంటాయని తెలిపారు. అయితే ఈ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్‌ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

ఒలింపిక్స్‌

అయితే పురుషుల విభాగంలో ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్, ప్రపంచ క్రికెట్‌లోని బలమైన జట్ల ఆధారంగా చూసుకుంటే ఈ జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశంకనిపిస్తోంది. టీ20 ప్రపంచ చాంఫియన్స్‌ ర్యాంకింగ్‌లో ఇండియా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. కాబట్టి ఒలింపిక్స్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. తర్వాత ఆస్ట్రేలియా ఇది కూడా టీ20 ఫార్మట్‌లో బలమైనే జట్టనే చెప్పవచ్చు. గతంలో ఈ జట్టు విజేతగా కూడా నిలిచింది. దీంతో పాటు టీ20 అగ్ర జట్లలో ప్రపంచ కప్ విజేతలుగా ఉన్న ఇంగ్లాండ్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వీటితో పాటు టీ20లో స్థిరమైన ప్రదర్శనతో బలమైన ఆటగాళ్లుగా ఉన్న న్యూజిలాండ్, టీ20 ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌లుగా నిలిచిన వెస్ట్ ఇండీస్, టీ20 ర్యాంకింగ్‌లలో తరచూ టాప్ 5-6 స్థానాల్లో ఉండే దక్షిణాఫ్రికాకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Los Angels Olympics: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ వేదిక ప్రకటించిన ఐసీసీ

ఐసీసీ చైర్మెన్

అయితే ఆ కాంపిటీష‌న్‌కు చెందిన ఓ వేదిక‌ను ప్ర‌క‌టించారు. ద‌క్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలో క్రికెట్ టోర్నీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది.లాస్ ఏంజిల్స్‌కు 48 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం క్రికెట్ వేదిక‌ను ప్ర‌క‌టించ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఐసీసీ చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పాపుల‌ర్ క్రీడ అని, అయితే హ‌ద్దులు దాటి ఆ క్రీడ‌ను ఒలింపిక్స్‌లో పెట్ట‌డం, మెగా ఈవెంట్‌కు వ‌న్నె తేనున్న‌ట్లు జే షా వెల్ల‌డించారు. టీ20 క్రికెట్ కొత్త ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌న్నారు. 1900 సంవ‌త్స‌రంలో చివ‌రిసారి పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడాడు. ఆ త‌ర్వాత క్రికెట్‌కు బ్రేక్ ప‌డింది. అయితే 2023 అక్టోబ‌ర్‌లో ముంబైలో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ 141వ సెష‌న్‌లో క్రికెట్ గురించి నిర్ణ‌యం తీసుకున్నారు.

Read Also: Yuzvendra Chahal: చాహల్ అద్భుత ప్రదర్శనపై స్పందించిన ఆర్ జే మహ్ వశ్

Related Posts
Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్
Mohammad Kaif: విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ కైఫ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై Read more

హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
Huge explosion at Hayat Nag

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఉదయం ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో Read more

Pakistan Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైట్ క్రాష్..ఇన్వెస్టర్లకు భయం
పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైట్ క్రాష్..ఇన్వెస్టర్లకు భయం

కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భరత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ వెబ్‌సైట్ ఒక్కసారి క్రాష్ అయ్యింది. వరుసగా Read more

USA: భారత నిఘా సంస్థ ‘రా’ పై ఆంక్షలు విధించిన అమెరికా ?
Has the US imposed sanctions on Indian intelligence agency 'RAW'?

USA: భారత్‌ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ది యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×