Samantha: గతేడాది15 బ్రాండ్​లకు నో చెప్పా:సమంత

Samantha: గతేడాది15 బ్రాండ్​లకు నో చెప్పా:సమంత

తెలుగు సినిమా ప్రముఖ నటి సమంతా తన కెరీర్‌లో మాత్రమే కాక, వ్యక్తిగత జీవితంలోనూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల విషయంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. నటిగా మాత్రమే కాదు, పబ్లిక్ ఫిగర్‌గా తన ప్రతి నిర్ణయం లక్షలాది మంది అభిమానుల జీవితాలపై ప్రభావం చూపుతుందని గుర్తించిన ఆమె, ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నట్టు పేర్కొన్నారు.ఆయా బ్రాండ్​లతో తన విలువలు అమరక గురించి తాను ఎలా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో వెల్లడించింది. ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. అందులో భాగంగా గతేడాది 15 బ్రాండ్​లకు నో చెప్పానని వెల్లడించింది.అయితే దీని వల్ల రూ.కోట్లలో నష్టపోయినట్లు పేర్కొంది.

Advertisements

జాగ్రత్తగా ఉంటున్నా

ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంతా, ‘‘పబ్లిక్ ఫిగర్‌గా నన్ను అభిమానించే వారికి నేను స్ఫూర్తిగా నిలవాలి. నేను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నేను ఎంచుకునే బ్రాండ్లు నా వ్యక్తిత్వాన్ని, నా విలువలను ప్రతిబింబించాలి. అలాంటప్పుడు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది’’ అని వివరించింది.సమంత తన 20ల వయసులో తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు.అప్పట్లో కొన్ని తప్పులు చేశానని అంగీకరించారు. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు.

ఫిట్‌నెస్‌ ఆరోగ్యంపై దృష్టి

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల విషయంలో స్పష్టమైన నిబద్ధత సమాజానికి హానికరమైనవి కాకుండా, తన విలువలకు అనుగుణంగా ఉన్న బ్రాండ్‌లనే ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పారు.గతేడాది 15 బ్రాండ్‌లను తిరస్కరించానని, అందువల్ల కోట్ల రూపాయల ఆర్ధిక నష్టం జరిగినా తన విలువలే ముఖ్యమని స్పష్టం చేశారు.‘‘నేను చేసే ఎండార్స్‌మెంట్ వల్ల ప్రజలు దాన్ని నమ్మి కొనుగోలు చేస్తారని నాకు తెలుసు. అందుకే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తున్నాను’’ అని చెప్పారు.2022లో మయోసిటిస్‌ వ్యాధి బయటపడిన తరువాత ఆ సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాక, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కూడా ఆమె ఆరోగ్యం, జీవనశైలికి అనుగుణంగా ఉండాలని చూసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌, మైండ్‌ఫుల్ నెస్‌, హోల్ ఫుడ్ డైట్‌ను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లోను ఇదే దారిని కొనసాగించనున్నారు.

 
 Samantha: గతేడాది15 బ్రాండ్​లకు నో చెప్పా:సమంత

తన దృష్టిలో ఒక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ అనేది కేవలం ఆర్థిక లాభం కోసం చేసే విషయం కాదని, అది తన వ్యక్తిత్వాన్ని ప్రజల్లో ఎలా ప్రతిబింబింపజేస్తుందని ఆమె భావిస్తోంది. “ఈ రోజు ఒక చిన్న నిర్ణయం నన్ను మంచి మార్గంలో నడిపిస్తే, అదే నా విజయానికి బలమైన పునాది అవుతుంది” అని సమంత అభిప్రాయపడింది.తాను ఎంచుకునే బ్రాండ్‌లు ప్రజల ఆరోగ్యం, భద్రత, సామాజిక మేలుకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్న సమంత, భవిష్యత్తులో కూడా ఇలాంటి బాధ్యతాయుతమైన నిర్ణయాలు కొనసాగిస్తానని తెలియజేసింది.

Read Also: Vijaya shanti : తారక్, కల్యాణ్ రామ్ లపై విజయశాంతి ప్రశంసల జల్లు

Related Posts
Vishwambhara: విశ్వంభర టీజర్ కు జాన్వీ రియాక్షన్ చూశారా..?
telugu samayam 1

జాన్వీ కపూర్: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్‌పై బాలీవుడ్ బ్యూటీ రియాక్షన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం "విశ్వంభర". Read more

Adhurs-2: ‘అదుర్స్-2’ సినిమాపై మనసులో మాట బయటపెట్టిన జూనియర్ ఎన్టీఆర్
Adhurs-2: 'అదుర్స్-2' సినిమాపై మనసులో మాట బయటపెట్టిన జూనియర్ ఎన్టీఆర్

అదుర్స్ 2పై ఎన్టీఆర్ స్పందన… దేవర 2పై క్లారిటీ! జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలలో 'అదుర్స్' ఒక స్పెషల్ సినిమా. 2010లో విడుదలైన ఈ చిత్రం Read more

Tuk Tuk :టుక్ టుక్ మూవీ రివ్యూ
Tuk Tuk :టుక్ టుక్ మూవీ రివ్యూ

చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడానికి కథలో కొత్తదనం అవసరం. ఇదే నమ్మకంతో కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీస్తున్నారు కొందరు దర్శకులు. అలా రూపొందిన మరో చిత్రం 'టుక్ Read more

Animal: ఏడాది క్రితం యానిమల్ దెబ్బకి థియేటర్స్ షేక్.!
animal movie

సినిమా విజయాన్ని చెప్పాలంటే, అది కేవలం థియేటర్లలో వసూళ్లు సాధించడమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలి. సినిమా విడుదలైన ఏడాది గడిచినా, ఆ చిత్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×