రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి

రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర మాట్లాడుతూ… రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisements

బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నం
రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ హత్యతో తనకు కానీ, బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని… హత్యపై సీబీఐతో లేదా సీఐడీతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి


కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై హైకోర్టులో కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగ మూర్తి (రాజలింగం) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గతరాత్రి గుర్తు తెలియని దుండుగలు కత్తులతో పొడిచి, గొడ్డళ్లతో నరికి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా రాజలింగం హత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. రామలింగమూర్తి హత్య పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీసీఐడీ విచారణకు నిర్ణ యించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించార ని ఆరోపించారు. ఈ ఘటనవెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేసా రు.

Related Posts
Temperatures : పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!
పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ Read more

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్
singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా Read more

జోరుగా చైనా మాంజా విక్రయాలు
china manja

హైదరాబాద్ మహానగరంలో నిషేధమున్నా చైనా మాంజా క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. నామ్‌ కే వాస్తేగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు పూర్తిస్థాయిలో మాంజా అందుబాటులో లేకుండా చేయడంలో విఫలమయ్యారు. Read more

వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్న దువ్వాడ-దివ్వెల మాధురి!
duvvada srinivas

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వారు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా ఉన్నారు. కుటుంబ Read more

×