Muralidhar Goud: ఎంతో పేదరికాన్నీ అనుభవించా :బలగం మురళీధర్

Muralidhar Goud: ఎంతో పేదరికాన్నీ అనుభవించా :బలగం మురళీధర్

‘బలగం’, ‘డీజే టిల్లు’ సినిమాలతో మరింత పాపులర్ అయిన నటుడు మురళీధర్ గౌడ్. ఆయన తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేశ్ మామ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తాజాగా ‘బిగ్ టీవీ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంతో పాటు తన లక్ష్యాల గురించి ప్రస్తావించారు.

సినిమా ఇండస్ట్రీ

“నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే నటనపై ఆసక్తితో టీవీ సీరియల్స్‌లో చిన్నచిన్న పాత్రలు పోషించాను. అయితే, రిటైర్మెంట్ తర్వాత నాకు పెద్ద పాత్రలు వస్తాయని అనుకున్నాను. కానీ సినీ ఇండస్ట్రీలో అవకాశం దొరకడం అంత తేలికకాదని అప్పుడు అర్థమైంది” అని మురళీధర్ గౌడ్ అన్నారు.అనేక అడ్డంకులు ఎదురైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో అనేక సినిమాల ఆఫీసుల చుట్టూ తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.’డీజే టిల్లు’ సినిమా నాకెంతో కీలకం. ఈ సినిమా తర్వాతే నా ప్రయాణం మలుపు తిరిగింది. నన్ను ఓ మంచి నటుడిగా ప్రేక్షకులు గుర్తించడానికి కారణమైంది” అని అన్నారు.

కోటీశ్వరుడిగా మారాలన్న సంకల్పం

మురళీధర్ గౌడ్ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. “మా కుటుంబం చాలా పేదది. ఐదుగురు పిల్లలు ఉండటంతో మా నాన్న ఒక్కడే కష్టపడి మా కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచి పేదరికాన్ని చూశాను. అప్పు చేసి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు , ఎవరి సహాయాన్ని ఆశించకుండా ఎదగాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.అయితే, తన జీవితంలో ఒక పెద్ద లక్ష్యం ఉందని మురళీధర్ గౌడ్ తెలిపారు. “సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ కోటీశ్వరుడిని కావాలనే పట్టుదల నాలో పెరుగుతూ వచ్చింది.అందుకు కారణం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను అనుభవిస్తూ వచ్చిన పేదరికమే.ఆ కసితోనే కోటీశ్వరుడిని కావాలనుకుంటున్నాను” అని చెప్పారు.

Copy of Profile1 6

పూర్తిగా ఫోకస్

“ఏ పని చేయాలనుకున్నా, దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టడం నా అలవాటు. అదే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది” అని మురళీధర్ గౌడ్ తన జీవిత సూత్రాన్ని వివరిస్తూ చెప్పారు. “నాకు అవకాశాల కోసం ఎదురుచూడటం ఎప్పుడూ నచ్చలేదు. నాపై నాకే నమ్మకం ఉంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే” అని చెప్పారు.

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు, ముందుగా మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. “ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలని అనుకుంటాను. నా కెరీర్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.ఈ ఇంటర్వ్యూ ద్వారా మురళీధర్ గౌడ్ తన విజయ పథాన్ని, ఎదురుకున్న కష్టాలను, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో తన కృషితో ఎదిగిన ఆయనకు మరిన్ని విజయాలు రావాలని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

Related Posts
Allu Arjun: అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య పెరుగుతున్న దూరం
Allu Arjun: అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య పెరుగుతున్న దూరం

టాలీవుడ్‌లో రెండు ప్రముఖ కుటుంబాలైన మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయా? అన్న ప్రశ్నకు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ Read more

RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ
RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఎస్.ఎస్. రాజమౌళి యొక్క అద్భుతమైన చిత్రం RRR యొక్క మేకింగ్‌ దృశ్యపరంగా ఆకర్షణీయమైన, కానీ కొంత సాధారణమైన డాక్యుమెంటరీగా Read more

అనసూయ వచ్చిందని ఆర్టీసీ బస్టాండ్‌‌ క్లోజ్.! ఎక్కడంటే
anasuya bharadwaj

ప్రయాణికుల అసహనం పెరిగింది ఆర్టీసీ అధికారుల చర్యపై. తాజాగా కడప జిల్లా మైదుకూరు పట్టణంలో జరిగిన సంఘటనలో ఆర్టీసీ అధికారులు అనవసరంగా బస్టాండ్‌ను మూసివేసి ప్రయాణికులను ఇబ్బందులకు Read more

ఓటీటీలోకి సూరజ్ ఆర్. బర్జాత్య
Suraj R into OTT. Barjatya

OTT ప్రపంచంలోకి సూరజ్ R. బర్జాత్య అడుగుపెడుతున్నందున, ప్రేమ మరియు కుటుంబం యొక్క నిరంతర మాయలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. హృద్యమైన కథలు మరియు కుటుంబ విలువలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *