కిమ్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి: ట్రంప్

Donald Trump: కిమ్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి: ట్రంప్

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ, కిమ్ ఒక అణుశక్తి అని వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కిమ్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి: ట్రంప్


అణ్వాయుధాలను తగ్గించాల్సిన అవసరం వుంది
మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని… వాటి శక్తి చాలా ఎక్కువని ట్రంప్ చెప్పారు. మనం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయం అవుతుందని అన్నారు. అణ్వాయుధాలను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉత్తరకొరియా, ఇండియా, పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తరకొరియా అణ్వాయుధాల విధానంలో ఎలాంటి మార్పునైనా సూచిస్తున్నాయా? అనే ప్రశ్నకు వైట్ హౌస్ అధికారి మాట్లాడుతూ… ట్రంప్ తన తొలి పదవీకాలంలో చేసినట్టుగానే ఉత్తరకొరియాను అణ్వాయుధ రహితంగా చేస్తారని చెప్పారు. ట్రంప్ తన తొలి పదవీకాలంలో కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

Related Posts
భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు
Business traits are in the blood of Indians.. Chandrababu

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. Read more

తనిఖీలతో ఉద్యోగాలు వదిలేస్తున్న భారతీయులు
trump

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు భారతీయ పార్ట్ టైమర్లకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా స్వదేశం వదిలి మెరుగైన ఉపాధి అవకాశాలు, చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన Read more

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు
20 killed 30 injured in ra

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య 20కి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దారుణ ఘటనలో దాదాపు 40 Read more

ట్రంప్ మరో సంచలన నిర్ణయం
Another sensational decisio

అమెరికా అధ్యక్షా పదవి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఆయన ఉత్తర్వులు జారీ Read more