हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Actress: ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో సర్వసం కోల్పోయినట్టు అనిపించింది: ప్రీతి జింటా

Anusha
Actress: ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో సర్వసం  కోల్పోయినట్టు అనిపించింది: ప్రీతి జింటా

హిందీ హీరోయిన్స్ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అవుతుంటారు. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే తారలు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో హీరోయిన్స్ పారితోషికాలు, అసమానతలు, నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతు పెంచే హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.అయితే ఆమె జీవితంలో ఓ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కారు ప్రమాదంలో మరణించాడు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఓ స్టార్ హీరోయిన్ ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. అలాగే కేరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.పాన్ ఇండియా హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) ఒకప్పుడు టాప్ హీరోయిన్. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. ఈ ముద్దుగుమ్మకు అభిమానులు డింపుల్ గర్ల్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తెలుగు, హిందీలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది.కొన్నాళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయిన నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంది. దిల్ సే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహ్తా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ అల్విదా నా కెహనా, మిషన్ కాశ్మీర్ వంటి పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

ఇంటర్వ్యూ

తెలుగులో వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమా, మహేష్ బాబు జోడిగా యువరాజు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన విషాదాన్ని పంచుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిపింది. ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో జీవితంలో సర్వసం కోల్పోయినట్టు అనిపించింది అని తెలిపింది. ‘క‌ల్ హో న‌హో` రీరిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూల్లో ఈ విషయాన్ని పంచుకుంది.ఐపీఎల్‌ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఆడిన 11 మ్యాచుల్లో 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 

Read Also : Actress: అగ్గిపుల్ల అని కామెంట్స్‌ చేశారు: అనన్య పాండే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870