हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sharwanand: తమన్నాని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు:శర్వానంద్

Anusha
Sharwanand: తమన్నాని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు:శర్వానంద్

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్ లో వస్తోన్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇది ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్ గా, అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 17న గ్రాండ్ గా థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో శర్వానంద్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.శర్వానంద్ మాట్లాడుతూ.. ”కొన్ని సినిమాలు ప్లాన్ చేయకుండానే అలా జరిగిపోతాయి. ‘ఓదెల 2’ టీజర్ చూడగానే నాకు అరుంధతి, అమ్మోరు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సంపత్ నందికి కాల్ చేసి చెప్పాను. నాకు ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకు ఉంది. ఇదొక వండర్ ఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసాను.. టీమ్ ఎఫర్ట్ కనిపించింది. ఒక ఏడాది కాలంగా నేను సంపత్ నందితో ట్రావెల్ చేస్తున్నా. ఈయనొక అడిక్షన్ లాగా. అందుకే కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఆయనతో తమన్నా నాలుగు సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు” అని అన్నారు.

స్టార్ హీరోయిన్

శర్వానంద్ మాట్లాడుతూ ,తమన్నాతో వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. రాబోయే రోజుల్లో కలిసి చేస్తామని అనుకుంటున్నా. తమన్నాని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు.. ఆమె ఒక వండర్ ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, ఇప్పుడు ‘ఓదెల 2’ లాంటి సినిమా చేసింది. జనాలు ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అదిరిపోతుందని, ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ వస్తాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది”అని అన్నారు.

 Sharwanand: తమన్నాని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు:శర్వానంద్

నమ్మకం

ఈరోజుల్లో కొన్ని సినిమాలకు వెళ్లాలని ఆడియన్స్ ముందే ఫిక్స్ అయిపోతున్నారు. నాలాగే అందరూ ఈ సినిమాని చూడాలని అనుకుంటున్నారని అనిపిస్తోంది. ట్రైలర్ లో సుందర్ రాజన్ విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ‘ఓదెల 2’ టీం మొత్తానికి నా అభినందనలు. మంచి సినిమా చేసారు. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్ కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. అందరికీ ఆల్ ది బెస్ట్” అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. చిత్ర బృందంతో పాటుగా ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ ఈ ఈవెంట్ కు గెస్టుగా పాల్గొన్నారు.

Read Also: Nani: కోర్ట్ సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ మూవీ చూడొద్దు :నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870