నితిన్ పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశా: గుత్తా జ్వాల

Gutta Jwala: నితిన్ పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశా: గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్ లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తా జ్వాలా హీరో నితిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ తాను చేయడానికి కారణం హీరో నితన్ అని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలా ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్‌ కోసం, ఆయన పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశానని తెలిపారు. బ్యాడ్మింటన్ లో రాణిస్తుండగా, ఆ తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పారు. అయితే, తనకు సినిమాలపై ఆసక్తిలేదని సున్నితంగా తిరస్కరించానని వివరించారు.

నితిన్ పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశా: గుత్తా జ్వాల


సినిమా ఇండస్ట్రీలో సర్దుకుపోవాల్సి వస్తుంది
సినిమా ఇండస్ట్రీలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, వారిని చూస్తే సినిమా రంగంలో ఎలా ఉండాలో తెలుస్తుందని గుత్తా జ్వాలా వివరించారు. సినిమాల్లో రాణించాలంటే సిగ్గు పడకూడదని, అది తనవల్ల కాదని చెప్పారు. ఎప్పుడో చేసిన సాంగ్ షూటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినా ఏదోలా అనిపిస్తుందని అన్నారు. చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుందని వివరించారు. తన మనస్తత్వానికి అది సరిపడదని తెలిపారు. బ్యాడ్మింటన్ లో పది గంటలు ప్రాక్టీస్ చేస్తే తర్వాత విశ్రాంతి తీసుకునే వీలుంటుందని, సినిమాల్లో అయితే 24 గంటలూ ఏదో ఒక పని ఉంటుందని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చారు.

పాటవల్ల సినిమాకు గుర్తింపు
హీరో నితిన్ తనకు మంచి స్నేహితుడని గుత్తా జ్వాలా చెప్పారు. ఓసారి పార్టీ జరుగుతుండగా తన సినిమాలో సాంగ్ చేయాలని కోరాడన్నారు. అప్పుడు తప్పించుకోవడానికి సరే అన్నానని, పార్టీ ముగిశాక ఆ విషయమే మర్చిపోయానని తెలిపారు. అయితే, మూడు నెలల తర్వాత నితిన్ తన దగ్గర మళ్లీ ఆ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చాడని, సాంగ్ ఫైనల్ అయిందని, చిత్రీకరణ త్వరలో ప్రారంభిస్తాం రెడీగా ఉండాలని చెప్పాడన్నారు. అప్పుడు నేను చేయలేనని చెబితే నితిన్ ఒప్పుకోలేదని, సాంగ్ లో తాను ఉండాల్సిందేనని పట్టుబట్టాడని తెలిపారు. తాను ఆ సాంగ్ లో కనిపించడం వల్ల నేషనల్ మీడియాలో ఆ సినిమా గురించి ఆర్టికల్స్ వచ్చాయని, సినిమాకు మంచి ప్రచారం జరిగిందని గుత్తా జ్వాలా చెప్పారు.

Related Posts
గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
celbs income

ఆదాయపు పన్ను భారీగా చెల్లించిన భారతీయ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇందులో మన సౌత్ స్టార్ హీరో 2వ స్థానం దక్కడం ఇంటర్నెట్‌లో సంచలనం Read more

శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.
శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్' మంచి విజయం సాధించింది. చందూ ,మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 80 కోట్లకు Read more

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ntr fans

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన ఫ్యాన్స్‌ను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతగా త్వరలో ఓ Read more

ఎట్టకేలకు బాబాయ్ అంటూ పవన్ పేరును ప్రస్తావించిన అల్లు అర్జున్
bunny pawan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *