పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ (OG Movie) పై దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులలో విపరీతమైన హైప్ నెలకొంది. పవన్ కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ గురించి షూటింగ్ ప్రారంభం నుంచే భారీ చర్చ సాగుతోంది. ఫ్యాన్స్ మాత్రం ప్రతి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తూ, సినిమా విడుదల దిశగా సాగుతున్న ప్రతీ అంశం మీదా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఓజీ’ ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ (LB Nagar) వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ అభిమానులు వేలాదిగా తరలి వచ్చి తమ అభిమాన హీరోను చూడటానికి పోటెత్తారు. స్టేడియం మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తించారు.వన్ సైతం వానలోనే తనదైన స్టయిల్లో మాట్లాడుతూ జోష్ నింపారు. తాను డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా మీ హీరోగా వచ్చానంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు పవన్.

ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి
‘ఓజీ కన్సార్ట్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకస్టేజిమీదకు కత్తి పట్టుకొని వచ్చిన పవన్ ఈ సినిమాకు హీరో నేను కాదు సుజీత్ (Sujith) అని దర్శకుడిని ఆకాశానికెత్తేశారు పవర్ స్టార్. డ్రమ్స్ శివమణి మ్యూజిక్ వాయిస్తుంటే మైక్‌తో అందరికీ వినిపించారు పవన్.
ఈ కార్యక్రమంలో హీరోయిన ప్రియాంక మోహనన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిలు పాల్గొన్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు.. ప్రత్యే ప్రీమియం షోకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: