అటవీ శాఖ అసోసియేషన్ సమావేశంలో మంత్రి సురేఖ (Minister Surekha) హైదరాబాద్: అటవీ అధికారులపై దాడులు చేస్తే పీడీ యాక్టులు పెడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Minister Surekha) స్పష్టం. మంగళవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీశాఖ అధికారుల అసోసియేషన్ సంఘాలతో -మంత్రి సురేఖ, ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (PCCF) డాక్టర్ సువర్ణ, సునీత భగవత్, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల సంఘాల నాయకుల తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ తాను ఫారెస్టు సిబ్బందికి ఒక అక్కగా అండగా ఉంటానని చెప్పారు. ఫారెస్టు ఉద్యోగుల సమస్యలు వినేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. చిన్న చిన్న విషయాలు శాఖపరంగా మనమే పరిష్కరించుకుందామన్నారు. కీలక అంశాలు సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఎందుకంటే, అటవీ శాఖకు, ఫారెస్టు (forest) ఉద్యోగులే ఫ్రంట్ రన్నర్స్ అని అలాంటి ఉద్యోగుల కోసం పని చేయడం తన బాధ్యత అన్నారు.

Minister Surekha
డీఆర్ఓలకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని
పోలీసులకు ఎటువంటి జీత భత్యాలు ఇస్తున్నారో. అటవీ అధికారులకు అంతే స్థాయిలో ఇచ్చేందుకు తాను ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ అదికారులకు అవార్డులు ఇచ్చేవారని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ అవార్డులు ఇవ్వడం ఆపేశారని మంత్రి సురేఖ గుర్తుచేశారు. అయితే, ఇటీవల జరిగిన ఆటవీశాఖ రివ్యూలో సీఎం (CM) దృష్టికి తీసుకెళితే ఆయన సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి సమావేశంలో ప్రస్తావించగా ఫారెస్ట్ ఉద్యో గులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు ఉద్యోగులు మహారాష్ట్ర (Maharastra) మాదిరి అటవీ భూములను అన్యాక్రాంతం చేసేవాళ్ళను కఠిన చట్టాలతో శిక్షించాలని, అటవీశాఖ బీట్ అధికారుల నియామకం వెంటనే చేపట్టాలని, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ లను జోన్ పోస్టును డిస్ట్రిక్ లెవల్ పోస్టుగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బీట్, సెక్షన్, డీఆర్ఓలకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని, ఫారెస్టు ఏరియాలో పని చేసే అధికారులను మూడు సంవత్సరాలకు ఒకసారైన కౌన్సిలింగ్ ద్వారా 100 శాతం బదిలీలు జరపాలని, ప్రతి జిల్లాకు రెండు, మూడు ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.
అటవీ అధికారులపై దాడులు చేస్తే ఏ చర్యలు తీసుకుంటారని మంత్రి సురేఖ చెప్పారు?
అటవీ అధికారులపై దాడులు చేస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి సురేఖ తెలిపారు.
అటవీ శాఖ ఉద్యోగుల సమస్యలపై మంత్రి ఏ విధంగా స్పందించారు?
చిన్న సమస్యలను శాఖపరంగా పరిష్కరించుకోవాలని, కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: