మహిళా సాధికారతకు పెద్దపీట మంత్రి సీతక్క (Minister Seethakka) హైదరాబాద్ : కూకట్పల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస, మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ‘ప్రతి మహిళ మహారాణి కావాలంటే ఆర్థిక స్వావలంబన అవసరమని, చేతిలో డబ్బు ఉన్నప్పుడే మహిళలకు స్వేచ్చ, గౌరవం లభిస్తుందన్నారు. కుటుంబం అభివృద్ధి, పిల్లలకు మంచి విద్య అందించాలంటే మహిళలు ఆర్థికంగా బలపడాలి’ అన్నారు. కూకట్పల్లి మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణలో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల గ్రీన్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన ఆమె, టు వీలర్, త్రీ వీలర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తయ్యాక వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ సేవల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు.

Minister Seethakka
ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మాట్లాడుతూ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ (MLA Arikepudi Gandhi) మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శేర్లింగంపల్లి నియోజక వర్గంలో ఉన్న ఐటి కంపెనీల సిఎస్ఆర్ (CSR) నిధులను మహిళా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని, ఆదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే అవకాశాన్ని కూకట్పల్లి మహిళా ప్రాంగణానికి అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బంద్రు శోభారాణి, (Chairperson Bandru Shobharani) మహిళా సంక్షేమ శాఖ సెక్రటరీ సీతారామచంద్రన్, ఉమెన్ కార్పొరేషన్ ఎండి చంద్రకాంత్ రెడ్డి, అల్విన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు?
కూకట్‌పల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస, మహిళా ప్రాంగణంలో ప్రారంభించారు.
ట్రైనింగ్ సెంటర్‌ను ఎవరు ప్రారంభించారు?
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: