हिन्दी | Epaper

News Telugu: Minister Konda Surekha – అటవీ శాఖ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం : మంత్రి కొండా సురేఖ

Rajitha
News Telugu: Minister Konda Surekha – అటవీ శాఖ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ (చార్మినార్) (Charminar) : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఆటవీశాఖ (Department of Sports) అధికారుల త్యాగం చిరస్మరణీయమని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర శివారులో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో గురువారం ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ముఖ్యఅతిధిగా హాజరైన ప్రసంగించారు. మంత్రి కొండా సురేఖ, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డిజిపి జితేందర్, ఆటవీ, పర్యావరణం, సైన్సు అండ్ టెక్సాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, అటవీ శాఖ ప్రధాన అధికారి సువర్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జూపార్కులోని స్మారకచిహ్నం వద్ద ఘనంగా నివాళులు ఆర్పించారు.

2014 నుంచి 25 జూలై వరకు

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం సెప్టెంబరు నెల 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ప్రతీ ఏడాది సెప్టెంబరు నెల 11వ తేదీన అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని ఆమె తెలియజేశారు. రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటి వరకు 22 మంది అటవీ సిబ్బంది ధైర్యసాహసాలతో పనిచేసి ఆటవీ నేరాలకు పాల్పడిన నేరస్థులను పట్టుకోవడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను (Martyrs) స్మరించుకుంటున్నామని ఆమె తెలిపారు. 2014 నుంచి 25 జూలై వరకు తెలంగాణ అటవీ శాఖ అధికారులు తమ శాయ శక్తుల కృషి చేసి టేకు, మారు జాతి కలపకు చెందిన నేరాలను అలాగే 10375 అటవీ భూ ఆక్రమణ కేసులను కూడ నమోదు చేయటం జరిగిందని. 2025 సంవత్సరంలో 149.66 కోట్ల కలపకు గాను 96813 కేసులు నమోదు చేసి రూ.51.50 కోట్ల జరిమానా వసూలు చేయటం జరిగిందని ఆమె తెలియ జేశారు.

Minister Konda Surekha

Minister Konda Surekha

పథకాలను చేపటట్టం జరుగుతుందని ఆమె తెలిపారు

67.13 కోట్ల రూపా యల విలువ చేసే టేకు, మారు జాతి కలవను స్వాధీనం చేసుకుని జప్తు చేశారని, రాష్ట్ర అటవీ సంపదను పరిరక్షించటానికి ప్రజల భాగస్వామ్యంతో పథకాలను చేపటట్టం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆటవీ సంరక్షణ, వ్యన్య ప్రాణుల సంరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆమె తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు (K.Ramakrishna Rao) మాట్లాడుతూ విధి. నిర్వాహణలో ఎంతో నిబద్ధతతో పని చేస్తూ అడవుల పరిరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. డిజిపి జితేందర్ మాట్లాడుతూ అడవుల పరిరక్షణలో అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషిని ఎన్నడు మరువలేమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, డిజిపి జితేందర్, రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్సు అండ్ టెక్సాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, పిసిసిఎఫ్(హెడ్) డాక్టర్ సువర్ణ, పిసిసిఎఫ్ వైల్లైఫ్ ఏలు సింగ్ మేరు, సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్, హైదరాబాద్ జిల్లా. కలెక్టర్ హరిచందన్ దాసరి, దక్షిణ మండలం డిసిపి స్నేహా మెహ్రా, జూపార్కు డైరెక్టర్ డాక్టర్. సునీల్ ఎస్. హీరేమత్, జూపార్కు క్యూరేటర్ వసంతతో పాటు పలువురు ఆటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Q1: అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
A1: ప్రతి సంవత్సరం సెప్టెంబరు 11న నిర్వహిస్తారు.

Q2: అటవీ అమరవీరుల త్యాగం గురించి మంత్రి కొండా సురేఖ ఏమన్నారు?
A2: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rain-cloudy-in-hyderabad-torrential-rain-in-the-suburbs/hyderabad/545473/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870