Lionel Messi Hyderabad : హైదరాబాద్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నట్లు సమాచారం. నగరంలోని చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ ఈ ప్రత్యేక భేటీకి వేదిక కానుంది. ‘గోట్ టూర్’లో భాగంగా కోల్‌కతాలో ఉన్న మెస్సీ ఈ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలో నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడే మెస్సీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
Read also : Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ
ఇక రాత్రికి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న (Lionel Messi Hyderabad) ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సింగరేణి RR9 జట్టు, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్‌తో తలపడనుంది. సుమారు 20 నిమిషాల మ్యాచ్‌లో మెస్సీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐదు నిమిషాల పాటు ఆడతారని సమాచారం.
ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :