సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని ముత్తంగి జాతీయ రహదారి 65 వద్ద ఈరోజు ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం, మేడ్చల్ డిపోకు(Medchal) చెందిన బస్సు మేడ్చల్ నుండి ఇస్నాపూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయిన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌పై ఎక్కి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Read Also: Train Accidents: పెరుగుతున్న రైలు ప్రమాదాలు..ఒక్క రోజులోనే మూడు ఘటనలు

అయితే అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు(Medchal) ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బస్సును క్రేన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. పోలీసులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: