తెలంగాణ సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులు ప్రసిద్ధ పిరేటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ iBomma, BappanTVలను మూసివేయించడంలో కీలక విజయం సాధించారు. ఈ రెండు సైట్లను నడిపిస్తున్నట్లు గుర్తించిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్దప్రమాణంలో డిజిటల్ పిరసీ నెట్‌వర్క్ కూలిపోయింది.
Read Also: Cyber Crime: iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

కోట్ల మంది డేటా ఉందని బెదిరించిన రవి
గతంలో ఇమ్మడి రవి ఓ వీడియోలో నా వద్ద కోట్లాది మంది యూజర్ డేటా ఉంది… ఈ సైట్‌పై ఫోకస్ చేయకండి” అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తన లొకేషన్ ఎవరూ గుర్తించలేరనే నమ్మకంతో దేశం–విదేశాల్లో అనేక సర్వర్ల ద్వారా ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ను నడిపిస్తూ చట్టాన్ని విస్మరించాడు. అయితే, చాలాకాలం నుంచి అతడు వినియోగిస్తున్న డిజిటల్ ట్రైల్స్‌ను ట్రాక్ చేస్తూ సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందం అతడి చుట్టూ ఉచ్చు వేసింది.
లాగిన్ వివరాలను స్వాధీనం చేసుకుని సైట్లను మూసివేత
సమగ్ర ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు ఇమ్మడి రవి నుంచి సైట్‌కి సంబంధించిన కీలక లాగిన్ యాక్సెస్, అడ్మిన్ వివరాలు, ఫైనాన్స్ ట్రైలు వంటి డేటాను స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల iBomma, BappanTV పేజీలు ఒక్కరాత్రిలోనే పూర్తిగా షట్‌డౌన్ అయ్యాయి. ఈ చర్యతో ప్రేక్షకులను బెట్టింగ్ యాప్‌లకు దారి తీసే ప్రమోషన్లతో వ్యవహరిస్తున్న రవికి భారీ దెబ్బ తగిలింది. ఈ అరుదైన ఆపరేషన్‌ను ప్రజలు, సైబర్ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆన్‌లైన్ సైబర్ నేరాలను తరిమికొట్టడంలో తెలంగాణ సైబర్ పోలీసుల సత్తా మళ్లీ నిరూపితమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: