Telugu Movies Piracy: దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలతో పాటు ఓటిటి కంటెంట్లను అధునాతన టెక్నాలజీని వాడి పైరసీ చేసి ఐ బొమ్మ(IBOMMA), బప్పం టివిలో ఉచితంగా ప్రసారం చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే రెండుసార్లు ఎనిమిది రోజుల పాటు పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కొన్న రవిని మరో నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. వారం రోజుల క్రితం నాలుగు కేసుల్లో మూడు రోజుల కస్టడీకి రవిని ఇవ్వగా పోలీసులు దీనిని వ్యతిరేకించారు.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఉచితంగా సినిమాల ప్రసారం కేసులో కీలక మలుపు
ఇతన్ని నాలుగు కేసుల్లో రెండు వారాలు లేదా వారం రోజుల పాటైనా కస్టడీకి ఇవ్వాలని, అలా అయితేనే అన్ని అంశాలను వెలికితీసే అవకాశం వుంటుందని కోరారు. ఇదే సమయంలో పోలీసు కస్టడీని రవి(immadi ravi) న్యాయవాది వ్యతిరేకించడంతో పాటు తన క్లయింట్కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు గత వారం ముగియగా దీనిపై మంగళవారం నాడు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ పోలీసులు కోరినట్లుగా రవిని నాలుగు కేసు(case)ల్లో ఏకంగా 12 రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో కేసులో ఇతన్ని మూడు రోజుల పాటు విచా రించాలని ఆయన ఆదేశించారు. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి రవిని పోలీసులు చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: